100 Years: మొదటి ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు వందేండ్లు.. ఇవాళ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు..

ఇవాళ అఖిల భారత శాసన సభాపతులు, మండలి ఛైర్మన్ల సదస్సు జరగనుంది. లోక్‌ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన పర్చువల్ విధానంలో ఈ సమావేశం జరగనుంది.

100 Years: మొదటి ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు వందేండ్లు.. ఇవాళ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు..
Speaker

ఇవాళ అఖిల భారత శాసన సభాపతులు, మండలి ఛైర్మన్ల సదస్సు జరగనుంది. లోక్‌ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన పర్చువల్ విధానంలో ఈ సమావేశం జరగనుంది. సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ స్పీకర్లు పాల్గొననున్నారు. వీరితోపాటు ఆరు రాష్ట్రాల మండలి ఛైర్మన్లు సమావేశానికి హాజరు కానున్నారు. కాగా, ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్లు సదస్సుకు వందేళ్ల పైర్తైన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

1921 సెప్టెంబర్ 15న సిమ్లాలో జరిగిన మొదటి ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు వందేండ్లు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా బుధవారం 81వ ఆలిండియా అసెంబ్లీ స్పీకర్లు అండ్‌ కౌన్సిల్ చైర్మన్ల సమావేశం జరుగుతుంది. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ లో లోక్ సభ స్పీకర్ అధ్యక్ష హోదాలో పాల్గొంటారు.

అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ స్పీకర్లు, 6 రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్లు ఆయా రాష్ట్రాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి రాజ్యసభ, లోక్ సభ TV లను కలిపి ‘సంసద్’ TV గా మార్చి ప్రసారాలను ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ శ్రీ వి.భూపాల్ రెడ్డి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ శాసనసభ భవనంలో ఏర్పాటు చేసిన వర్చువల్ విదానం ద్వారా కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి: KTR: సైదాబాద్ నిందితుడు దొరకలేదు.. ఆ ట్వీట్ పొరపాటున చేశా: మంత్రి కేటీఆర్

 

Click on your DTH Provider to Add TV9 Telugu