Terrorists: నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే ఉగ్రవాదుల టార్గెట్.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ అలర్ట్స్

ఢిల్లీ, యూపీ, ఇతర రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో జాన్‌ మహ్మద్‌ షేక్‌ అలియాస్‌ సమీర్, ఒసామా, మూల్‌చంద్, జేషన్‌ ఖమర్, మహ్మద్‌ అబూ బకర్, మొహ్మద్‌ అమీర్‌ జావెద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Terrorists: నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే ఉగ్రవాదుల టార్గెట్.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ అలర్ట్స్
Terrorists
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 15, 2021 | 7:41 AM

ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ సెల్‌ ఉగ్రవాాదులకు సంబంధించి కీలక సమాచారం సేకరించింది. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది. పాక్‌– ఐఎస్‌ఐ వద్ద ట్రైనింగ్ తీసుకున్న ఇద్దరు టెర్రరిస్టులతో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలను టార్గెట్ చేసుకొని దేశవ్యాప్తంగా పలు పేలుళ్లకు వీరు కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, యూపీ, ఇతర రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో జాన్‌ మహ్మద్‌ షేక్‌ అలియాస్‌ సమీర్, ఒసామా, మూల్‌చంద్, జేషన్‌ ఖమర్, మహ్మద్‌ అబూ బకర్, మొహ్మద్‌ అమీర్‌ జావెద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్‌ఐ వద్ద ట్రైనింగ్ తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఢిల్లీ, యూపీల్లో ఐఈడీ(పేలుడు పదార్థం) ఉంచేందుకు సరైన ప్లేసులను వెతకడానికి వీరిని నియమించినట్లు వివరించారు. వీరి అరెస్టుతో పాక్‌– ఐఎస్‌ఐ– టెర్రరిస్టుల సంబంధం బయటపడిందని,  అండర్‌వరల్డ్‌ సహకారంతో ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో పలు పేలుళ్లు జరిగే ప్రమాదాన్ని నివారించినట్లయిందని స్పెషల్‌ సెల్‌ డీసీపీ ప్రమోద్‌ సింగ్‌ వెల్లడించారు. అలహాబాద్‌లో జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రకుట్రలో వివిధ పనులు చేసేందుకు వీరిని నియమించినట్లు గుర్తించారు. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరుడు అనీస్‌ ఇబ్రహీంకు సమీర్‌ దగ్గరి వాడని పోలీసులు తెలిపారు. పాక్‌లో ఉంటున్న అనీస్‌ ఆదేశాల మేరకు పేలుడు పదార్థాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను ఇండియాలోని వివిధ ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు అందించేందుకు సమీర్‌ తయారయ్యాడన్నారు.

ఇక ఢిల్లీలో అరెస్టయిన ఉగ్రవాది జాన్‌ మహ్మద్‌ షేక్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ను ముంబై పోలీసులు, ఏటీఎస్‌ అధికారులు విచారించారు. షేక్‌ ఇంట్లో సోదాలు సైతం నిర్వహించినట్లు పోలీసులు వివరించారు. సెంట్రల్‌ ముంబైలో షేక్‌ కుటుంబం ఉంటోంది. కొన్నేళ్లుగా ఇక్కడే షేక్‌ నివాసముంటున్నాడని, అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులు వివరించారు.  జాన్‌ గురించి ఇరుగుపొరుగును కూడా పోలీసులు విచారించారు. జాన్‌కు టెర్రరిస్టులతో ఎలా సంబంధం ఏర్పడిందన్న విషయమై ఆరాతీశారు.

Also Read: సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు.. వివరాలు గోప్యంగా ఉంచుతామన్న సీపీ

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!