Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saidabad Girl Rape: సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు.. వివరాలు గోప్యంగా ఉంచుతామన్న సీపీ

సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుడి జాడ కోసం అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. నిందితుడి పై రివార్డు ప్రకటించింది హైదరాబాద్ పోలీస్‌ శాఖ.

Saidabad Girl Rape: సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు.. వివరాలు గోప్యంగా ఉంచుతామన్న సీపీ
Hyderabad Police Commissioner
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 14, 2021 | 8:00 PM

Hyderabad Police: సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుడి జాడ కోసం అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. నిందితుడి పై రివార్డు ప్రకటించింది హైదరాబాద్ పోలీస్‌ శాఖ. రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు ఇస్తామంటూ రివార్డు ప్రకటించారు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసుపై కీలక సమీక్ష నిర్వహించారు పోలీసు ఉన్నతాధికారులు.

నిందితుడు రాజు ఆనవాళ్లను విడుదల చేశారు సీపీ అంజనీకుమార్‌. రాజు రెండు చేతులపై మౌనిక అనే టాటూ ఉందని.. వయస్సు సుమారు 30 ఏళ్లుగా ఉంటుందని చెప్పారు. రాజు ఎత్తు 5.9 అడుగులుగా ఉంటుందని.. పెద్ద జుట్టుకు రబ్బర్‌ బ్యాండ్‌ వేసుకొని తిరుగుతాడని వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వాళ్లు పోలీసులకు ఫోన్‌ చేయాలని కోరారు. నిందితుడిపై ఏకంగా రూ. 10 లక్షల రివార్డు ను ప్రకటించారు పోలీసులు. ఆ నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామంటూ ఓ ప్రకటన ను కూడా విడుదల చేశారు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి డబ్బులు ఇవ్వడం తో పాటు… వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం తాము రివార్డు ప్రకటిస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616366 మరియు 9490616627 అనే ఫోన్‌ నంబర్ల కు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్‌ సీపీ తెలిపారు. ఇక ఇప్పటికే నిందితుడి ఆనవాళ్లు విడుదల చేశారు పోలీసులు.

Saidabad Rapist

Saidabad Rapist

Read Also… Terrorists Arrest: దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదుల ఫ్లాన్.. కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు