Terrorists Arrest: దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదుల ఫ్లాన్.. కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు

తాలిబన్ల స్ఫూర్తితో భారత్‌లో దాడులకు కుట్ర చేశారు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర చేసిన ఉగ్రవాదుల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాక్‌ ఐఎస్‌ఐ, దావూద్‌ గ్యాంగ్‌ కలిసి చేసిన కుట్రను భగ్నం చేసింది ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌.

Terrorists Arrest: దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఉగ్రవాదుల ఫ్లాన్.. కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు
Terrorists Arrested


Terror module in Delhi: తాలిబన్ల స్ఫూర్తితో భారత్‌లో దాడులకు కుట్ర చేశారు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర చేసిన ఉగ్రవాదుల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాక్‌ ఐఎస్‌ఐ, దావూద్‌ గ్యాంగ్‌ కలిసి చేసిన కుట్రను భగ్నం చేసింది ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌. అయోధ్యతో పాటు నవరాత్రి వేడుకల్లో పేలుళ్లకు ఈ ముఠా కుట్ర చేసినట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించి పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఢిల్లీ పోలీసులు అనుమానితులను అరెస్ట్ చేశారు.

జీషన్‌ కమార్‌ , మహ్మద్‌ అబూబకార్‌ , మహ్మద్‌ అలీ షేక్‌ , మూల్‌చంద్‌ , ఉసైద్‌ ఉర్‌ రెహ్మాన్‌ , మహ్మద్‌ అమీర్‌ జావేద్‌ అనే ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ పోలీసుల సాయంతో ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర , ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర చేశారు. అరెస్టయిన ఉగ్రవాదుల దగ్గరి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలను , ఆయుధాలను స్వాథీనం చేసుకున్నారు. అయా రాష్ట్రాల నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల ముఠాను అరెస్ట్‌ చేశారు. వీటి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రితో పాటు విలువైన సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also…  Fish Ponds: విశాఖ జిల్లాలోని అనధికార రొయ్యల చెరువులపై కొరడా ఝుళిపిస్తోన్న రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు

Click on your DTH Provider to Add TV9 Telugu