Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife Burns Man: ప్రియుడి మోజులో పడి భర్తకు నిప్పు.. తప్పించుకునేందుకు యత్నించిన వ్యక్తిపై బండరాయితో దాడి..!

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ తాళి కట్టిన భర్తనే పెట్రోల్ పోసి నిప్పంటించి అత్యంత దారుణంగా హతమార్చింది. బెంగుళూరులో జరిగిన ఈ ఘటన కలకలం స‌ృష్టి్ంచింది.

Wife Burns Man: ప్రియుడి మోజులో పడి భర్తకు నిప్పు.. తప్పించుకునేందుకు యత్నించిన వ్యక్తిపై బండరాయితో దాడి..!
Wife Burns Man
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 14, 2021 | 8:35 PM

Karnataka Wife Burns Man: కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ తాళి కట్టిన భర్తనే పెట్రోల్ పోసి నిప్పంటించి అత్యంత దారుణంగా హతమార్చింది. బెంగుళూరు ప్రాంతంలోని బద్దిహళ్లి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం స‌ృష్టి్ంచింది.

నల్లమగండ్ల ప్రాంతానికి నారాయణప్ప(52) ఒక ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నారు. అతని భార్య అన్నపూర్ణమ్మ(36) ఉల్లిపాయ మండీలో కూలీగా పనిచేస్తోంది. వీరికి 14 ఏళ్ల కుమార్తెతో పాటు 12 ఏళ్ల కవలలు కూడా ఉన్నారు. అయితే, అదే ప్రాంతానికి చెందిన పెయింటర్‌గా పని చేస్తున్న రామకృష్ణ(35)తో అన్నపూర్ణమ్మతో పరిచయం ఏర్పడింది. ఆమె అవసరాలను ఆసరాగా చేసుకుని తరుచూ డబ్బులు ఇచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయంపై భార్యా-భర్తల మధ్య తరుచు గొడవలు జరగుతుండేవని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో అన్నపూర్ణ తన భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో తన ప్రాణాలను కాపాడటానికి, నారాయణప్ప ఇంటి నుండి బయటకు పరుగులు తీశాడు. మంటలను ఆర్పడానికి డ్రైనేజీలో పడిపోయాడు. అదే సమయంలో ఇంట్లో ఉన్న రామకృష్ణ డ్రైనేజీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నారాయణప్ప తలపై బండ రాయిని పడేశాడు. తలకు తీవ్ర గాయాలైన అతడు అక్కడికక్కడే మరణించాడు.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న జయనగర పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ముగ్గురు కుమార్తెలు ఇంట్లో ఉన్నారు. పెద్ద కుమార్తె మొత్తం సంఘటనకు సాక్షి కాగా, చిన్న కూతుళ్లు గదిలో ఉన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also.. Saidabad Girl Rape: సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు.. వివరాలు గోప్యంగా ఉంచుతామన్న సీపీ

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!