AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: సైదాబాద్ నిందితుడు దొరకలేదు.. ఆ ట్వీట్ పొరపాటున చేశా: మంత్రి కేటీఆర్

KTR on Saidabad Rape Case: హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపిన సంఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అందరిని

KTR: సైదాబాద్ నిందితుడు దొరకలేదు.. ఆ ట్వీట్ పొరపాటున చేశా: మంత్రి కేటీఆర్
Ktr
Shaik Madar Saheb
|

Updated on: Sep 15, 2021 | 12:47 AM

Share

KTR on Saidabad Rape Case: హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపిన సంఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. అభంశుభం తెలియని చిన్నారిని చిదిమేసిన రాజు అనే వ్యక్తిని చంపాలంటూ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఆ ఉన్మాదిని చంపాలంటూ సోషల్‌ మీడియాలో ట్విట్లు చేస్తున్నారు. ఘటన అనంతరం పారిపోయిన మానవ మృగం కోసం ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రాజును పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డ్‌ అందించనున్నట్లు పోలీసులు మంగళవారం ప్రకటించారు.

అయితే.. సైదాబాద్‌ ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనలో నిందితుడు పట్టుబడ్టట్టు గతంలో తాను చేసిన ట్వీట్‌ను మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఉపసంహరించుకున్నారు. తప్పుడు సమాచారం వల్ల ఈ ప్రకటన చేశానని మంత్రి కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. సమాచారలోపంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్టు పొరపాటున తాను ట్విట్‌ చేశానని తెలిపారు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు హైదరాబాద్‌ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారని కేటీఆర్‌ వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు.

నిందితుడు త్వరగా అరెస్టయి, తగిన శిక్షపడటం ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరగాలని కోరుకుందామని మంత్రి కేటీఆర్‌ ట్విట్లో ఆకాంక్షించారు. కాగా.. ఈ ఘటన అనంతరం నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read:

Saidabad Girl Rape: సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు.. వివరాలు గోప్యంగా ఉంచుతామన్న సీపీ

Hyderabad: పాతబస్తీలో బరితెగించిన యువకుడు..మైనర్​ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కట్టేసి కొట్టిన స్థానికులు..!