Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేసిన జీవీఎల్.. ఆ విషయంలో పీహెచ్‌డీ చేసిందంటూ..

Andhra Pradesh: బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో అభివృద్ధి అనేదే కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేసిన జీవీఎల్.. ఆ విషయంలో పీహెచ్‌డీ చేసిందంటూ..
Gvl
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 15, 2021 | 2:10 PM

Andhra Pradesh: బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లలో అభివృద్ధి అనేదే కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. అప్పులేనిదే పూట గడవని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఏదైనా ఆలోచన చేస్తుందా? అంటే అదీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజలపై భారం మాత్రమే వేస్తుందంటూ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభత్వ పథకాలను నీరుగార్చే విధంగా ఏవేవో ఆదేశాలిస్తోందని విమర్శలు గుప్పించారు. పాలనా పరంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.

కేంద్రం చెపట్టేవి తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ప్రత్యేకంగా ఖర్చు పెట్టింది లేదని జీవీఎల్ విమర్శించారు. విజయవాడ – బెంగళూరు హై వే నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపడుతోందన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్ ప్రారంభమైందని, ఇంకా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ప్రభుత్వం తామిప్పుడు డబ్బులు ఇవ్వలేమంటోందన్నారు. 8 లక్షల 16 వేల కోట్ల రూపాయిలతో ఏపీ లో మౌళిక వసతుల కల్పనకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని జీవీఎల్ తెలిపారు. అభివృద్ది విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా ఓటింగ్ కే పరిమితమైతే అదే మిగులుతుందని వ్యాఖ్యానించారు.

ఇక రివర్స్ టెండరింగ్ అంశంపైనా జీవీఎల్ విమర్శలు గుప్పించారు. రివర్స్ రెండరింగ్ అని మొదలు పెట్టారు కానీ రాష్ట్రంలో రివర్స్ అభివృద్ది జరుగుతుందని ఎద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం దూరాలోచన అని భావిస్తుందని, అయితే తాము మాత్రం దురాలోచన అనుకుంటున్నామని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఇకపోతే సినిమా టికెట్ రేట్ల వివాదంపైనా జీవీఎల్ విమర్శలు గుప్పించారు. సినిమా టికెట్స్ అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టి.. రాబోయే ఏడాదికి రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే అని చూపుతూ కొత్తగా రుణాలు తెద్దామనుకుంటున్నారేమో అని దుయ్యబట్టారు. సినిమా టిక్కెట్లను తామే అమ్ముతామంటున్న ప్రభుత్వం.. రేపు సినిమాలు కూడా మేమే తీస్తామంటారేమో అని విమర్శించారు.

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేశామని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కేంద్రంలోని పెద్దలను, రైల్వే బోర్డు ఛైర్మన్ సునీల్ శర్మను కలిసి విశాఖ రైల్వే జోన్‌ని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని కోరామన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానిది విధానపరమైన నిర్ణయం అన్నారు. నిధుల సేకరణ మాత్రమే కాదని, మానుఫ్యాక్షరింగ్ రంగాన్ని బలోపేతం చేయాలనే చూస్తున్నామన్నారు. స్టీల్‌ప్లాంట్ విషయములో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సరైందే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారని జీవీఎల్ పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దేనికి ఖర్చు పెడుతుందో తెలియదన్నారు. అవి బయటపెడితే మిగతా నిధులను కేంద్రం ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అప్పుతెచ్చుకోవడం, అరువు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్‌డీ చేసిందని సెటైర్లు వేశారు.

Also read:

NRI Support: చైత్రకు ప్రవాసాంధ్రుల నివాళులు.. నిందితుడిని కఠిన శిక్షించాలంటూ డిమాండ్..

Love Suicide: తన ప్రేమను ఒప్పుకోలేదని మనస్తాపనం చెందిన మైనర్ బాలిక.. మరుసటి రోజు గ్రామ శివారులోని..

Ganesh Visarjan 2021: హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం.. రేపు విచారిస్తామన్న సుప్రీంకోర్టు..