BJP: టీటీడీ పాలకమండలిపై సర్కార్ నిర్ణయం.. ఏపీ బీజేపీ ఫైర్.. సభ్యుల సంఖ్యను పెంచితే న్యాయం పోరాటం

టీటీడీ పాలకమండలి విషయంలో సభ్యుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది ప్రభుత్వం. టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే రెన్యువల్‌ చేసింది. ఇదే అంశంపై బీజేపీ స్పందించింది.

BJP: టీటీడీ పాలకమండలిపై సర్కార్ నిర్ణయం.. ఏపీ బీజేపీ ఫైర్.. సభ్యుల సంఖ్యను పెంచితే న్యాయం పోరాటం
Somu Veerraju
Follow us

|

Updated on: Sep 15, 2021 | 2:11 PM

టీటీడీ పాలకమండలి విషయంలో సభ్యుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది ప్రభుత్వం. టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే రెన్యువల్‌ చేసింది. మిగిలిన పాతిక మంది సభ్యుల ఎంపికలో రకరకాల కొలమానాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. సేవాభావం కలిగినవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం జగన్‌. ఇప్పటికే సీఎం‌తో వరుసగా భేటీ అవుతున్నారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. పాతికమందితోపాటు.. మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. అయితే.. వీరికి విధాన పరమైన నిర్ణయాల్లో ఎలాంటి పాత్ర ఉండదు. తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు కల్పించనుంది జగన్ ప్రభుత్వం.

పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు నుంచి ఇద్దరు, కర్నాటక నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా మల్లాడి కృష్ణారావు నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ విషయాన్ని మల్లాడి మీడియాకి వెల్లడించారు. తనను టీటీడీ సభ్యునిగా నియమించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు మల్లాడి. టీటీడీ పాలకమండలి ప్రకటన ఈరోజు సాయంత్రం గాని.. రేపు గాని ఉండే అవకాశముంది.

ఇదిలావుంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రియాక్ట్ అయ్యారు. తిరుమల వెంకన్నతో జగన్ ఆడుకుంటున్నారని విమర్శించారు. జంబో పాలకమండలి నిర్ణయం సరికాదని సూచించారు. పాలకమండలి సభ్యుల నియామకంపై సీఎం పునరాలోచన చేయాలన్నారు. పాలక మండలి సభ్యుల సంఖ్యను పెంచితే న్యాయం పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి: నెల్లూరులో దారుణం.. యువతిని వ్యభిచారం చేయాలంటూ దారుణంగా హింసించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

Viral Video:నీటి గుంటలో ఎంచక్కా ఈత కొట్టేస్తున్న బుజ్జి కుక్క పిల్లలు.. మీ కళ్లను మీరే నమ్మలేరు..

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం