Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెల్లూరులో దారుణం.. యువతిని వ్యభిచారం చేయాలంటూ దారుణంగా హింసించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వ్యభిచారం చేయాలంటూ ఓ వ్యక్తి యువతిని కర్రతో చికతబాదిన ఘటనపై పోలీసుల స్పందించారు. యువతిపై దాడికి..

నెల్లూరులో దారుణం.. యువతిని వ్యభిచారం చేయాలంటూ దారుణంగా హింసించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
Follow us
Subhash Goud

|

Updated on: Sep 15, 2021 | 12:08 PM

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వ్యభిచారం చేయాలంటూ ఓ వ్యక్తి యువతిని కర్రతో చికతబాదిన ఘటనపై పోలీసుల స్పందించారు. యువతిపై దాడికి పాల్పడిన వెంకటేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి జిల్లాలోని రామకోటయ్య నగర్‌కు చెందిన వెంకటేష్‌గా గుర్తించారు పోలీసులు. అలాగే వీడియో తీసిన శివ కుమార్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. యువతిని వ్యభిచారం చేయాలంటూ దారుణంగా హింసించి వెంకటేష్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా, ఇతరులతో వ్యభిచారం చేయాలంటూ యువతిని కర్రతో కొట్టడంతో చేతి రాజులు పగిలి రక్తం కారుతున్నా.. ఆ మానవ మృగాడు ఏ మాత్రం కనికరించలేదు. తమ వాళ్లు చూస్తే బాధపడతారని బాధితురాలు ప్రాధేయపడుతున్నా.. ఆ వ్యక్తి మాత్రం కర్రతో కొట్టడం ఆపలేదు. కర్రతో కొట్టకుండా అడ్డుకుంటే దుస్తులు చించివేస్తానని యువతిని బెదిరించాడు ఆ నీచుడు. పైగా మరో వ్యక్తితో వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు ఆ వీడియో పోలీసుల వరకు వెళ్లింది.  రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అరెస్టు చేశారు. నీకు నిన్న ఏం చెప్పాను.. నువ్వు ఏం చేశావు.. అంటూ ఆ వ్యక్తి యువతిపై కర్రతో ఇష్టానుసారంగా దాడికి దిగాడు. ఆ వీడియో తీసిన వ్యక్తి కూడా పైశాచిక ఆనందం పొందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అతనితో పాటు ఇంకెంత మంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.

Venkatesh

నిందితుడు వెంకటేష్

ఇంకో విషయం ఏంటంటే.. బాధితురాలికి 18 రోజుల కిందటనే వివాహం జరిగింది. ఈ దాడి మూడు నెలల కిందటనే జరుగగా, నిన్న ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.

దేశంలో మహిళపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యువతులపై దాడులను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినా.. కొందరు నీచులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. వికృత చేష్టలకు దిగుతున్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నా.. ఏ మాత్రం భయపడకుండా నీచానికి దిగుతున్నారు.

ఇవీ కూడా చదవండి: Robbery: నెల్లూరు నగరంలో వెరైటీ చోరీ.. మాట్లాడూతూనే మాయం చేసేశాడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Sim Fraud: రూ.11 రీచార్జ్‌ చేసినందుకు బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.6 లక్షలు మయం.. మోసగాడి వలలో సీనియర్‌ సిటిజన్‌