AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robbery: నెల్లూరు నగరంలో వెరైటీ చోరీ.. మాట్లాడూతూనే మాయం చేసేశాడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

Robbery in Andhra Pradesh: ఎవరైనా దోపిడీ చేస్తే నగలో, డబ్బులో, మరేదైనా విలువైన వస్తువులో దోపిడీ చేస్తారు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి మాట్లాడినట్లు నటిస్తూనే.. విచిత్ర దోపిడీకి పాల్పడ్డాడు.

Robbery: నెల్లూరు నగరంలో వెరైటీ చోరీ.. మాట్లాడూతూనే మాయం చేసేశాడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Robbery
Shiva Prajapati
|

Updated on: Sep 15, 2021 | 9:26 AM

Share

Robbery in Andhra Pradesh: ఎవరైనా దోపిడీ చేస్తే నగలో, డబ్బులో, మరేదైనా విలువైన వస్తువులో దోపిడీ చేస్తారు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి మాట్లాడినట్లు నటిస్తూనే.. విచిత్ర దోపిడీకి పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే.. నెల్లూరులో విచిత్రమైన చోరీ జరిగింది. మినీ బైపాస్ రోడ్డులో ఉన్న రెడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ షాపు దగ్గరకు ఓ కుర్రాడు వచ్చాడు. చూడటానికి టిప్ టాప్‌గా.. రిచ్‌గానే కనిపించాడు. ముందు షాపు బయట ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆ తర్వాత షాపులోకి వెళ్లి.. అక్కడ పనిచేసేవారితో కాసేపు ఏదో మాట్లాడాడు. మళ్లీ షాపులో నుంచి బయటకు వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. ఎవరూ రాని సమయం చూసి రెండు కుర్చీలను మడతపెట్టాడు. వాటిని చేతిలోకి తీసుకుని.. అసలు తనకేమీ తెలియనట్లు సరదాగా అలా నడుచుకుంటూ రోడ్డు దాటేసి వెళ్ళిపోయాడు.

అయితే, ఈ సీన్ మొత్తం అక్కడే షాపులో, బయట ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముందు యువకుడు కుర్చీల్లో కూర్చుని టెస్ట్ చేసినట్లు కనిపించింది. తర్వాత నచ్చిందో ఏమో గానీ, వాటిని ఎత్తుకెళ్లిపోయాడు. కాగా, ఈ చోరీ వీడియోలో సోషల్ మీడియాలో హాట్ ట్రెండింగ్‌ నిలుస్తోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. యువకుడు కూర్చీలను చూసి ముచ్చట పడి ఉంటాడని సెటైర్లు వేస్తున్నారు. కాగా, కుర్చీల చోరీ ఘటనపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video:

Also read:

Humanity: ఆస్థి రాయించుకుని 90ఏళ్ల తల్లిని అనాథగా వదిలేసిన నలుగురు కూతుళ్లు.. కలెక్టర్‌ను ఆశ్రయించిన వృద్ధురాలు

Zomato: ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో నుంచి సీఈవో గౌరవ్‌ గుప్తా రాజీనామా.. కారణం ఏంటంటే..!

Bigg Boss 5 Telugu: పంథం నీదా నాదా సై.. శ్రుతిమించిన ఆటతీరు.. మెడికల్ రూమ్‏కు కంటెస్టెంట్..