AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Humanity: ఆస్థి రాయించుకుని 90ఏళ్ల తల్లిని అనాథగా వదిలేసిన నలుగురు కూతుళ్లు.. కలెక్టర్‌ను ఆశ్రయించిన వృద్ధురాలు

Humanity: మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు .. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం నేడు అన్న మాటలను గుర్తు చేస్తూ రోజు రోజుకీ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి.  ఒక అమ్మ..

Humanity: ఆస్థి రాయించుకుని 90ఏళ్ల తల్లిని అనాథగా వదిలేసిన నలుగురు కూతుళ్లు.. కలెక్టర్‌ను ఆశ్రయించిన వృద్ధురాలు
Kurnool Crime News
Surya Kala
|

Updated on: Sep 15, 2021 | 9:15 AM

Share

Humanity: మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు .. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం నేడు అన్న మాటలను గుర్తు చేస్తూ రోజు రోజుకీ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి.  ఒక అమ్మ ఎంత మంది పిల్లల్నినైనా ఎన్ని కష్టనష్టాలు వచ్చినా వెరవకుండా పెంచుతుంది. అదే అమ్మని వంద మంది పిల్లలు.. చూడరు.. బరువు అనుకుంటారు.. వాదులాడుకుంటారు.. నెలకి ఒకరు చొప్పున పంచుకుంటారు. కొంతమంది కొడుకులుకోడళ్ళు  అయితే తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. వృద్దాప్యంలో అండగా ఉంది.. చిన్నపిల్లల్లా చూసుకోవాల్సిన తల్లిదండ్రులను అనాధల్లా వదిలేస్తున్నారు. రోడ్లపాలు చేసేవారు కొంతమంది అయితే.. అనాథాశ్రమంలో చేర్చేవారు మరికొందరు. అయితే ఇక్కడ ఓ వృద్ధురాలైన తల్లి నుంచి ఆస్థి తీసుకుని ఆపై తల్లిని పట్టించుకోకుండా వదిలేశారు కుమార్తెలు. దీంతో ఆ అమ్మ న్యాయం కోసం అధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని బనగానపల్లె మండలం యనగండ్ల గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు బాలనాగమ్మ తన నలుగురు కుమార్తెలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. బాలనాగమ్మకు నలుగురు కుమార్తెలు.. గతంలోనే తల్లికి ఉన్న 50 ఎకరాల భూమిలో 40 ఎకరాల భూమిని ఇప్పటికే వారి పేరుతో రాయించుకున్నారు. అయితే అప్పటి నుంచి తల్లిని పట్టుకోవడం మానేశారు. అంతేకాదు మిగిలిన 10 ఎకరాలను కూడా తమ పేరుతో రాయమని అమ్మపై ఒత్తిడి తీసుకొచ్చారు. వృద్ధిరాలిపై నలుగురు కుమార్తెలు తమ దాష్టీకం ప్రదర్శిస్తూ.. ఇబ్బందులకు గురు చేస్తున్నారు. దీంతో బాలనాగమ్మ జిల్లా కలెక్టర్ కు తన కుమార్తెలు కేవలం తన ఆస్తి కావాలనే ఒత్తిడి చేస్తున్నారని తన పోషణను మాత్రం పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేసింది.  దీంతో ఈ కేసుని మానవ హక్కుల కమిషన్ కార్యాలయం సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుని వెంటనే విచారించి నివేదిక సమర్పించాలని మానవహక్కుల కమిషన్ కు  కర్నూలు ఆర్డీవో హరి ప్రసాదు ను ఆదేశించింది.

Also Read: కిడ్నాప్​కు గురైన ఆరేళ్ల బాలికను 24 గంటల్లోనే తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన పోలీసులు