NRI Support: చైత్రకు ప్రవాసాంధ్రుల నివాళులు.. నిందితుడిని కఠిన శిక్షించాలంటూ డిమాండ్..
NRI Support: గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు తీవ్రంగా ఖండించారు.

NRI Support: గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు తీవ్రంగా ఖండించారు. అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్‌లో తాజాగా ఆరేళ్ల చిన్నారి చైత్రపై జరిగిన ఘోరాన్ని ప్రవాసాంధ్రులు తీవ్రంగా ఖండించారు. చిన్నారిపై ఘాతుకానికి పాల్పడిన హంతకుడిని ప్రజల సమక్షంలో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు భద్రత కల్పించడంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఘోరంగా విఫలమయ్యారని ప్రవాసాంధ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇకనైనా స్పందించి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రులు కొవ్వత్తులు వెలిగించి చిన్నారి చైత్రకు శ్రద్ధాంజలి ఘటించారు.
రాజును పట్టుకునేందుకు 1000 మంది పోలీసులు.. ఇదిలాఉండగా.. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీ ఘటనలో నిందితుడైన రాజు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రాజు కోసం మొత్తం 1000 మంది పోలీసులు 70 బృందాలుగా వేర్పడి వేట సాగిస్తున్నారు. అయితే, రాజు సెల్‌ఫోన్ వాడకుండా తెలివిగా తప్పించుకుంటున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కారణంగానే రాజు ఆచూకీ గుర్తించడం ఆలస్యమవుతోందంటున్నారు. దీంతో రాజు ఆచూకీ కోసం సీసీ కెమెరాలను నమ్ముకున్నారు పోలీసులు. వందల కొద్దీ సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అయితే, సీసీ కెమెరాల్లో ఆనవాలు దొరకకుండా రాజు అడుగులు వేస్తున్నాడు. తలకు ఎర్రటి టవల్ కట్టుకుని జుట్టును కవర్ చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే చిన్ వద్ద గడ్డం కనిపించకుండా మాస్క్‌తో కవర్ చేస్తున్నట్లు గుర్తించారు. కాగా, టాస్క్ ఫోర్స్ డీసీపీ, ఈస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి రాజు కోసం గాలింపు చేపడుతున్నారు. ఇక రాజు ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది పోలీసు శాఖ.
చిన్నారి చైత్ర హత్యాచార ఘటనపై అమెరికాలో ఆందోళన.. Watch Video
Also read:
Love Suicide: తన ప్రేమను ఒప్పుకోలేదని మనస్తాపనం చెందిన మైనర్ బాలిక.. మరుసటి రోజు గ్రామ శివారులోని..