VH: ఏంటీ అయోమయం..! పట్టుకున్న వాళ్లకి పది లక్షలు కాదు.. ముందు ఆ చిన్నారి కుటుంబాన్ని ఆదుకోండి: వీహెచ్

ఒకరు నిందుతుడు దొరికారు అంటారు. మరొకరు దొరకలేదు.. పట్టుకున్నవాళ్లకి రివార్డ్స్ అంటూ ప్రకటిస్తారు. మరొకరు ఎన్ కౌంటర్ చేసి

VH: ఏంటీ అయోమయం..! పట్టుకున్న వాళ్లకి పది లక్షలు కాదు.. ముందు ఆ చిన్నారి కుటుంబాన్ని ఆదుకోండి: వీహెచ్
Vh On Saidabad Raju
Follow us

|

Updated on: Sep 15, 2021 | 3:55 PM

V Hanumantha Rao: ఒకరు నిందుతుడు దొరికాడు అంటారు. మరొకరు దొరకలేదు.. పట్టుకున్నవాళ్లకి రివార్డ్స్ అంటూ ప్రకటిస్తారు. మరొకరు ఎన్ కౌంటర్ చేసి పారేస్తామంటారు. అసలేంటిది అంటూ అయోమయాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు. ఇటీవల సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి.. నిందితుడు రాజు విషయంలో వీహెచ్ సంధించిన ప్రశ్నలివి. నిందితుడ్ని పట్టుకుంటే పట్టుకుంటే పది లక్షల ఇవ్వడం కాదు.. ముందు అ కుటుంబాన్ని ఆదుకోండి అంటూ ఆయన తెలంగాణ సర్కారుకు చురకలంటించారు.

ఈ మధ్యాహ్నం హైదరాబాద్ గాంధీ భవన్ లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. “సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిని అత్యంత ఘోరంగా రాజు అనే వ్యక్తి చంపేశాడు. ఇలాంటి ఘటనలు తెలంగాణాలో కొత్త కాదు. గతంలో హాజీపూర్‌లో కూడా జరిగింది. నిర్బయ, దిశా ఘటనలు జరిగినా ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. నిందితులకి వేసే శిక్ష ప్రజలు చూసేలా వెయ్యాలి. సీఎం గారు.. మీ మంత్రులని అదుపులో పెట్టుకోండి. అంటూ వీహెచ్ సలహా ఇచ్చారు.

చిన్నిరిని చంపిన రాజు విషయంలో ఒకే గవర్నమెంట్‌లో మూడు స్టెస్ట్మెంట్స్ వస్తున్నాయి.. ఒక మంత్రి అయి ఉండి ఎన్‌కౌంటర్ చేస్తామని ఎట్లా చెపుతారు..? అని.. నిన్న కార్మిక మంత్రి మల్లారెడ్డి.. చిన్నారిని చంపిన నిందితుడు రాజు గురించి చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ  వీహెచ్..  కేసీఆర్ సర్కారుని నిలదీశారు. ప్రజలని మభ్యపెట్టానికే ఆ మాటలు అంటూ ఆయన విమర్శించారు. పోలీసులు నిందితుడ్ని పట్టుకుంటే పది లక్షల ఇస్తామంటున్నారు అది కాదు.. ముందు ఆ బాధిత బాలిక కుటుంబాన్ని ఆదుకోండి అని వీహెచ్ చెప్పుకొచ్చారు.

Read also: Hyderabad: పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఆకతాయిల చేష్టలు మితిమీరుతున్నాయి.. సీటీలో మరో ఘటన