AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చురేపుతున్న దళితబంధు.. ఎందుకు.. ఎలాగంటే?

తెలంగాణ కాంగ్రెస్ లో దళిత బంధు చిచ్చు రేగుతోంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకం విషయంలో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిందా..?

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చురేపుతున్న దళితబంధు.. ఎందుకు.. ఎలాగంటే?
Revanth Reddy, Bhatti Vikramarka
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 15, 2021 | 3:56 PM

Congress on Dalit Bandhu Scheme: తెలంగాణ కాంగ్రెస్ లో దళిత బంధు చిచ్చు రేగుతోంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకం విషయంలో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిందా… పార్టీ తరపున తీసుకున్న స్టాండ్‌కు కట్టుబడాలా లేక.. పరిస్థితులను ముందుకు వెళ్లాలా అనేది అంతు చిక్కడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ లో దళిత బంధు విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనేది తేల్చుకోలేకపోతుందట.

కాంగ్రెస్ పార్టీలో గొడవలు, గ్రూప్ తగాదాలు కామన్. కానీ తాజాగా కాంగ్రెస్‌లో ఏర్పడిన చిచ్చు కాస్త ఢిఫరెంట్ అని చెప్పవచ్చు. లీడర్లే కాదు.. పార్టీ మొత్తం డిఫెన్స్‌లో పడిపోయినట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ ఇటీవల తీసుకువచ్చిన దళిత బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాల పేరిట భార బహిరంగ సభలు నిర్వహిస్తోంది.

దళిత బంధు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సైలెంట్ గా ఉంటే పార్టీ కి గడ్డు పరిస్థితి తప్పదంటున్నారు. ఇప్పటికే రైతుబంధు వంటి స్కీమ్‌ల ద్వారా టీఆర్ఎస్ బలమైన ఓటు బ్యాంకు నిలబెట్టుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో మరో బలమైన ఓటు బ్యాంకు దళితులను తమవైపు తిప్పుకొనేందుకు టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఓటు బ్యాంకును కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ తర్జనభర్జనలు పడుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు కాంగ్రెస్‌ను కన్ఫ్యూజ్ చేస్తోంది.

దళిత బంధు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్‌కు.. స్వంత పార్టీలోనే భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వాదన మరోలా ఉంది. దళిత బంధు ద్వారా ప్రతీ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వడాన్ని భట్టి స్వాగతిస్తున్నారు. అంతేకాదు.. దేశంలోనే దళితుల కోసం ఇంత మంచి పథకం లేదని చెప్పుకొస్తున్నారు. కానీ దళితులందరికీ పది లక్షలు ఇచ్చినప్పుడే లబ్ధి చేకూరుతుందని.. అయితే, గతంలో సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

సీఎల్పీ నేతగా భట్టి తీసుకుంటున్న స్టాండ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రేవంత్ పైకి ఏమి అనకపోయినా అంతర్గతంగా మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అందుకే సీఎం కేసీఆర్ వద్ద జరిగే రివ్యూకు భట్టి విక్రమార్క హాజరవుతానని చెప్పడంతో రేవంత్ కు ఇష్టం లేకపోయినా సైలెంట్‌గా ఉన్నారట. భట్టి నివాసంలో జరిగిన బ్రేక్ ఫాస్ట్ భేటీ కి ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, రాజగోపాల్ రెడ్డి, పొడెం వీరయ్య , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. కానీ, పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు.

మొత్తం మీద దళిత బంధు పథకం కాంగ్రెస్ లో విభజన తీసుకొచ్చింది. ఈ దళిత బంధు స్కీమ్ విషయంలో ఎలాంటి వైఖరి అనుసరిస్తే.. ఎలాంటి పరిస్థితి తలెత్తుందనేది డైలమా నెలకొంది. ముఖ్యంగా త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన నెలకొంది.

అశోక్ భీమనపల్లి, టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్.

Read Also…. Diwali Crackers: దీపావళి సంబరాల్లో బాణసంచాపై సంపూర్ణ నిషేధం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆ రాష్ట్ర సర్కార్

సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట.. రఘురామ కృష్ణంరాజు పిటీషన్‌ తిరస్కరణ