Diwali Crackers: దీపావళి సంబరాల్లో బాణసంచాపై సంపూర్ణ నిషేధం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆ రాష్ట్ర సర్కార్
Delhi Diwali Crackers Ban: వాతావరణ కాలుష్యంతో అల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీకి ఊరట. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Delhi Diwali Crackers Ban: వాతావరణ కాలుష్యంతో అల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీకి ఊరట. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీపావళి సంబరాల్లో బాణసంచా ఉపయోగించడంపై అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. అన్ని రకాల బాణసంచా నిల్వ, అమ్మకాలు, వాడకంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. దీపావళి పండుగ పురస్కరించుకుని జరుపుకునే బాణాసంచా సంబరాలు, టపాసుల శబ్దాలు, పొగతో గాలి కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థితిలో ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బుధవారం ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.
గత ఏడాది కూడా దీపావళి బాణసంచా కాల్చడంపై ఢిల్లీ ప్రభుత్వం సంపూర్ణ నిషేధం విధించింది. ప్రమాదకర గాలి కాలుష్యానికి, కోవిడ్-19 వ్యాప్తికి సంబంధం ఉందని నిపుణుల సూచనల మేరకు ఈ నిషేధం విధించింది. సీఎం కేజ్రీవాల్ బుధవారం చేసిన ట్వీట్‌లో.. ‘‘గత మూడేళ్ళలో దీపావళి సందర్భంగా ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయి దృష్ట్యా, గత ఏడాది మాదిరిగానే, అన్ని రకాల బాణసంచా నిల్వ, అమ్మకాలు, వాడకంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఈ చర్యలు తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు.
पिछले साल व्यापारियों द्वारा पटाखों के भंडारण के पश्चात प्रदूषण की गंभीरता को देखत हुए देर से पूर्ण प्रतिबंध लगाया गया जिससे व्यापारियों का नुकसान हुआ था। सभी व्यापारियों से अपील है कि इस बार पूर्ण प्रतिबंध को देखते हुए किसी भी तरह का भंडारण न करें।
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 15, 2021
గత ఏడాది బాణసంచాపై నిషేధం విధించడం ఆలస్యమైనందువల్ల కొందరు వ్యాపారులకు నష్టం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా సంపూర్ణ నిషేధం విధించినందువల్ల బాణసంచాను నిల్వ చేయవద్దని, అమ్మవద్దని కోరారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఇలాంటి చర్చలు తప్పవని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం కేజ్రీవాల్ కోరారు.
Read Also… సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట.. రఘురామ కృష్ణంరాజు పిటీషన్ తిరస్కరణ