NCRB Report: అత్యాచార కేసుల్లో ఆ రాష్ట్రం టాప్.. రెండో స్థానంలో యూపీ: ఎన్‌సీఆర్‌బీ సంచలన రిపోర్టు
NCRB Report: భారత్‌లో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు జరగని రోజంటూ ఉండదు. ఏదో ఒక చోటు మహిళలు దారుణాలు జరుగుతూనే..
NCRB Report: భారత్‌లో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు జరగని రోజంటూ ఉండదు. ఏదో ఒక చోటు మహిళలు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారాలతో ఎంతోరో మహిళలు బలైపోతున్నారు. కానీ లెక్కలోకి వచ్చిన కేసులు కొన్ని మాత్రమే. లెక్కకు రాని దారుణాలు అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో అత్యాచారాల కేసుల గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2020 డేటాను వెల్లడించింది. ఈ డేటా ప్రకారంగా చూస్తే అత్యాచార కేసుల్లో టాప్‌లో రాజస్థాన్ రాష్ట్రం ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. సాధారణంగా అత్యాచారాలు ఎక్కవగా జరిగే రాష్ట్రం అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఉత్తరప్రదేశ్. ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరిగేది యూపీలోనే. కానీ ఇప్పుడు రాజస్థాన్ యూపీని మించిపోయిందని ఎన్‌సీఆర్‌బీ డేటా వెల్లడించింది.
ఇక దేశంలో నమోదైన అత్యాచారాల కేసుల్లో రాజస్థాన్ టాప్‌లో ఉండగా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్, నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020 నివేదిక చెబుతోంది. ఈ గణాంకాల ప్రకారం .. గత ఏడాది 2020లో రాజస్థాన్‌లో అత్యధికంగా 5,310 అత్యాచార కేసులు నమోదు కాగా, ఉత్తరప్రదేశ్‌లో 2,769 అత్యాచారా కేసులు, మధ్యప్రదేశ్ లో 2,339 కేసులు, ఇక 2,061 కేసులతో మహారాష్ట్ర నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక లైంగిక దాడి బాధితుల్లో 4,031 మంది మహిళలు ఉండగా, 1,279 మంది 18 ఏళ్లలోపువారే కావటం సమాజం ఎటువైపు వెళ్తుందో గమనించాల్సిన విషయం. ఈ నేరాలకు పాల్పడిన నిందితుల్లో ఎక్కువగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారే ఉండటం గమనార్హం.
ఈ క్రమంలో రాజస్థాన్‌లో మహిళాలపై నేరాలు 16 శాతం తగ్గాయని ఎన్‌సీఆర్‌బీ రిపోర్టు వెల్లడించింది. అంటే నమోదు అయినవాటిలో కొన్ని తప్పుడు ఫిర్యాదులుగా నిర్ధారణ అయ్యాయి. 2020లో మహిళాలపై నేరాలకు సంబంధించి 49,385 కేసుల నమోదుతో ఉత్తరప్రదేశ్ టాప్‌లో ఉండగా, 36,439 కేసులతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, 34,535 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో ఉన్నాయి. మరోవైపు ఎస్సీ నేరాలపరంగా కూడా రాజస్థాన్ టాప్‌లో ఉంది. 2018 నుంచి 2020 వరకు ఈ క్రైమ్ రేటు 57.4 శాతానికి పెరిగింది. ఎస్సీ నేరాలకు సంబంధించి 2018లో 4,607 కేసులు, 2019లో 6,794, 2020లో 7,017 కేసులు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేస్తోంది.
42 శాతం తప్పుడు కేసులే..
రాజస్థాన్‌లో అత్యాచార కేసుల విషయంలో నేర విభాగం ఏడీజీ రవి ప్రకాష్ మెహర్దా మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్ రాష్ట్రంలో అత్యాచార కేసులు ఎక్కువగా నమోదైనప్పటికీ, అందులో 42 శాతం తప్పుడు ఆరోపణలేనని దర్యాప్తులో తేలిసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నేరాలు పెరగడం, పోలీసులు నమోదు చేసే నేరాలు పెరగడం అనేవి రెండు వేర్వేరు విషయాలని.. ఈ విషయాన్ని గుర్తించాలని అన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, మహిళలపై దారుణాలకు ఒడిగట్టే నిందితులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు.