Saidabad Incident: సైదాబాద్ హంతకుడు రాజు ఆత్మహత్య.. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్‌పై..
యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోది. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి..
యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోది. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న రాజు చివరికిి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. వివరాల్లో వెల్లితే.. సైదాబాద్ సింగరేణి కాలనీ రేప్ కేస్ ఘటన నిందితుడు.. రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. ఘట్కేసర్- వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం పడి ఉన్నట్టు గమనించారు పోలీసులు.. నగర నడిబొడ్డులోని సైదాబాద్- సింగరేణి కాలనీ..ఇక్కడి నుంచి ఇతడు ఉప్పల్ తప్పించుకుని వెళ్లాడు. రాజు కడసారి కనిపించింది ఉప్పల్లోనే.. తర్వాత అతడి ఆచూకీకోసం పోలీసులు చేయని ప్రయత్నాల్లేవు..
టాటూను చూసి..
సైదాబాద్ కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై డెడ్‌బాడీ పడి ఉందనే సమాచారంతో స్పాట్‌కి వెళ్లారు పోలీసులు. రాజు చేతిపై ఉన్న టాటూను చూసి ఆతనేనని కన్‌ఫామ్ చేసుకున్నారు. రాజును పట్టుకునేందుకు పోలీసులు వేర్వేరు బృందాలుగా గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు సీసీ ఫుటేజ్‌ను ఎక్కడికక్కడ తిరగేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.
అసలేం జరిగింది..
గత ఏడు రోజుల నుంచి రాజు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. రాజును పట్టుకునేందుకు 100 బృందాలను పోలీసులు రంగంలోకి దించింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజు ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పట్టారు. ఈ నెల 9వ తేదీన సైదాబాద్‌లో చిన్నారిపై రాజు హత్యాచారం చేశాడు. నాటి నుంచి రాజు కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. ఇక అన్ని వైన్ షాపుల వద్ద నిందితుడు రాజు ఫోటోను ఉంచి నిఘా పెట్టారు. బస్సులు, ఆటోలపై రాజు ఫోటోలు ప్రదర్శించి.. అతని ఆచూకీ కోసం విస్తృతంగా తనిఖీలు చేశారు. రాజు నిన్న ఉప్పల్ ప్రాంతంలో సంచరించినట్లు తెలుస్తోంది. రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.
మంత్రుల ఓదార్పు..
సైదాబాద్ రేప్ కేస్ వ్యవహారంలో స్పందించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. కొద్దిసేపటి క్రితం మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ సైదాబాద్ వెళ్లారు రూ . 20 లక్షల చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. నిందితుడ్ని పట్టుకొని శిక్షించడంతోపాటు.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌లో హత్యకు గురైన ఆరేండ్ల చిన్నారి కుటుంబాన్ని మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. తీరని దుఃఖంలోఉన్న చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు.
ఇవి కూడా చదవండి: సైదాబాద్ చిన్నారి ఆత్మ శాంతించింది.. సరిగ్గా వారం రోజులకే రైల్వే పట్టాలపై శవమైన మానవ మృగం