అధిక లాభం పేరుతో పెట్టుబడి పెడుతున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..! వెంటనే తెలుసుకోవాల్సిన నిజాలు..

Hyderabad: కొద్ది నెలల నుండి పూర్తిగా పేమెంట్ ఆగిపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 2.5 కేజీల బంగారం తో పాటు హైదరాబాదులో విలాసవంతమైన ప్రాపర్టీస్ కి సంబంధించిన పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు..

అధిక లాభం పేరుతో పెట్టుబడి పెడుతున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..! వెంటనే తెలుసుకోవాల్సిన నిజాలు..
Investing With High Profit
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 01, 2023 | 6:27 PM

హైదరాబాద్, నవంబర్01; అధిక లాభం వస్తుందని నమ్మించి పెట్టుబడి పెట్టమని మిమ్మల్ని ఒత్తిడి తెస్తున్నారా ?  ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటి జోలికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో జరుగుతున్న పోంజి స్కాం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో చైన్ సిస్టం మాదిరి పెట్టుబడులు పెట్టిస్తూ అధిక లాభాలు ఇస్తామని నమ్మబలుకుతూ.. కొందరు దుండగులు బాధితులను నిండా ముంచుతున్నారు.. హైదరాబాద్ లో తాజాగా వెలుగు చూసిన ఒక స్కామ్ లో ఏకంగా బాధితుల నుండి 530 కోట్ల రూపాయలు వసూలు చేశారు నిందితులు. అధిక వడ్డీ పేరుతో తిరిగి వాటిని చెల్లించలేక మొహం చాటేసి తప్పించుకు తిరుగుతున్న నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రస్తుత భారత చట్టాల ప్రకారం మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కాం పూర్తిగా నిషేధం. ఒకరి నుండి ఒకరికి చైన్ సిస్టం ద్వారా కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటూ నమ్మించి కొత్తగా స్కీం లో చేరుతున్న వారి దగ్గర నుండి డిపాజిట్లు సేకరించి వాటిని వడ్డీల రూపంలో పాతవారికి చెల్లింపులు చేస్తూ జరుగుతున్న మల్టీల్వేల్ మార్కెటింగ్ స్కాం జోలికి ఎవరు వెళ్ళవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. గతంలో మల్టీలు మార్కెటింగ్ పేరుతో వచ్చిన అనేక స్కాములు ఈ తరహాలోనే మూతపడ్డాయి. ఉదాహరణకు Q net స్కాo, కరక్కాయల పొడి స్కాం, vihaan కంపెనీ స్కాం వంటి ఘటనలు మన కళ్ళ ముందరే జరిగాయి. అయినా సరే చాలామంది మల్టీలెవెల్ మార్కెటింగ్ వైపు అధిక లాభాలపై మోజు పెంచుకుంటున్నారు.. ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కాo లు కేవలం కొన్ని మాత్రమే తెర మీద కనిపిస్తున్నాయి . వెలుగులోకి రానీ ఎన్నో స్కాం ల బారిన పడ్డ బాధితులు ఏమీ తోచక బిక్కుబిక్కుమంటున్నారు.

ఒక కంపెనీని మొదలుపెట్టి అందులోని ప్రొడక్ట్స్ కొనుగోలు చేయమని మొదటి దశలో నిందితులు పథకం వేస్తారు… ప్రొడక్ట్స్ ను బాగా వైరల్ చేసి వాటిని కొనడానికి వచ్చిన కస్టమర్స్ ను సంస్థ ప్రతినిధులు టార్గెట్ చేస్తారు. అలా ప్రొడక్ట్స్ కొనడానికి వచ్చిన వారి నుండి తక్కువ మొత్తంలో డిపాజిట్ చేయించుకొని వారు ఇతరులను ఈ స్కీం లో జాయిన్ చేస్తే కమిషన్ ఇస్తామని నమ్మబలుకుతారు.. అలా వీరి ద్వారా జాయిన్ అయిన వ్యక్తులకు ఇదే స్కీం చెబుతారు…తక్కవ మొత్తం లో వీరి దగ్గర నుండి డిపాజిట్ లు సేకరించి చైన్ సిస్టం ద్వారా మరింత మందిని ఇందులో బాధితులుగా చేరుస్తున్నారు…అలా చేరిన ఒక్కో వ్యక్తికి సైతం కమిషన్ రూపంలో చెల్లింపులు ఉంటాయని నమ్మిస్తారు..ఒక స్టేజ్ వచ్చిన తరువాత వడ్డీలు కట్టేందుకు ఇబ్బందిగా మారడం తో ఒక్కసారిగా చేతులు ఎత్తేస్తారు.. ఇటీవల ఇలాంటి నేరాలు ఎక్కువైపోయాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా హైదరాబాదులో మరో కొత్త తరహా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. నిందితులు చేస్తుంది చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్. హైదరాబాద్ గోల్నాక నుండి స్టాక్ తీసుకొని విజయవాడ వెళ్లి అక్కడ వ్యాపారం చేస్తుంటాడు.. ఇద్దరు నిందితులు సంవత్సరం పాటు ఈ తరహా వ్యాపారం చేశాక మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కాంకు తెర లేపారు. తమ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వడ్డీల రూపంలో ఇస్తామని ఆశ చూపి కొన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.. రెండు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 200 మంది బాధితుల నుండి దాదాపు 530 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు సేకరించారు. తిరిగి వడ్డీల రూపంలో చెల్లించిన డబ్బులు 430 కోట్లు రూపాయలు… ఇలా వెనుక జాయిన్ అవుతున్న వారు చెల్లిస్తున్న డబ్బులను పాతవారికి వడ్డీలుగా చెల్లిస్తూ వచ్చారు. అలా కొద్ది నెలల నుండి పూర్తిగా పేమెంట్ ఆగిపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 2.5 కేజీల బంగారం తో పాటు హైదరాబాదులో విలాసవంతమైన ప్రాపర్టీస్ కి సంబంధించిన పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలెవరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో జరిగే మోసాల బారిన పడకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే