Hyderabad: గోల్డ్ షాప్‌నే బురిడీ కొట్టించిన ఎంఎల్‌ఏ అభ్యర్థి.. కట్‌చేస్తే.. ఊహించని షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు..

అయితే రెగ్యులర్ ప్రాక్టీస్ లో భాగంగా ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్‌కి బంగారాన్ని కరిగించే క్రమంలో అసలు విషయం బయటపడింది.అమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చిన గాజులు కేవలం గోల్డ్ కోటేడ్ అని బంగారం షాప్ నిర్వాహకులు గుర్తించారు. షాపులో ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఇది పూర్తిగా 916 ప్యూరిటీకి చెందినది అని షాప్ నిర్వాహకులను నమ్మించాడు.

Hyderabad: గోల్డ్ షాప్‌నే బురిడీ కొట్టించిన ఎంఎల్‌ఏ అభ్యర్థి.. కట్‌చేస్తే.. ఊహించని షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు..
Hyderabad Police
Follow us
Vijay Saatha

| Edited By: Venkata Chari

Updated on: Nov 01, 2023 | 3:14 PM

Hyderabad: హైదరాబాద్‌లో ఓ ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ గోల్డ్ బ్యాంగిల్స్‌ను ఒరిజినల్ బంగారం అని నమ్మించి గోల్డ్ షాప్ నిర్వాహకులను మోసం చేసిన కేసులో నిందితుడిగా తేలాడు. గోల్డ్ షాప్ నిర్వాహకుల ఫిర్యాదుతో పెట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎన్నికల బరిలో దీపేష్ అనే అభ్యర్థి నిలిచాడు. గత సెప్టెంబర్లో హైదరాబాద్‌లో గోల్డ్ స్టోర్‌లో షాపింగ్ చేశాడు. తన దగ్గర ఉన్న రెండు బంగారు గాజులను ఎక్స్చేంజ్ చేసి కొత్త గాజులను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సుచిత్ర లో ఉన్న సౌత్ ఇండియన్ జ్యువెలరీ షాప్ కి వెళ్లి 31.3 గ్రాముల బరువు ఉన్న గాజులను ఎక్స్చేంజ్ కు పెట్టాడు. వీటికి బదులు రెండు గాజులను తమ షాప్ నుంచి తీసుకున్నారని పోలీసులకు సౌత్ ఇండియన్ షాపు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 15న సుచిత్ర వద్ద ఉన్న సౌత్ ఇండియన్ జ్యువెలరీ షాప్ కు వెళ్లి తన రెండు గాజులు ఎక్స్చేంజ్ చేశాడు. వీటికి బదులుగా షాప్ లో ఉన్న 27.5 గ్రాముల గాజులను తీసుకెళ్లాడు.

అయితే రెగ్యులర్ ప్రాక్టీస్ లో భాగంగా ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్‌కి బంగారాన్ని కరిగించే క్రమంలో అసలు విషయం బయటపడింది.అమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చిన గాజులు కేవలం గోల్డ్ కోటేడ్ అని బంగారం షాప్ నిర్వాహకులు గుర్తించారు. అయితే షాపులో ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఇది పూర్తిగా 916 ప్యూరిటీకి చెందినది అని షాప్ నిర్వాహకులను నమ్మించాడు. కట్ చేస్తే.. అవి పూర్తిగా నకిలివని తేలినట్టు షాప్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 28న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్న పెట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హైదరాబాదులోనే రాజస్థాన్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపేష్ ను అరెస్ట్ చేశారు.

దీపేష్ పై ఐపీసీ 406(criminal breach of trust), తో పాటు ipc 420 ( మోసపూరిత) కేసులు నమోదు చేశారు. సోమవారం రోజు పెట్ బషీరాబాద్ లోనే దిపేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..