Guntur Crime: మ్యాట్రిమోనిలో పెళ్లి పేరిట ఘరానా మోసం.. రూ.ఏడున్నర లక్షలు తీసుకొని విదేశాలకు జంప్

ఇద్దరిదీ గుంటూరు కావడం, ఒకరంటే మరొక ఇష్టపడటంతో స్వాతిక్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఫోన్ లోనే ఇద్దరూ అంగీకారానికి వచ్చారు. తరుచూ ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అయితే అతను ఓ రోజు ఫోన్ చేసి, అర్జంట్‌గా డబ్బులు కావాలని ఆమెను అడిగాడు. పెళ్లి కూడా కుదరటంతో ఆమె అతన్ని నమ్మింది. ఏకంగా ఏడున్నర లక్షల రూపాయల డబ్బులను అతనికి ఇచ్చింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వీరిద్దరి వివాహం ఈ రోజు జరగాల్సి ఉంది. అయితే ఏడున్నర లక్షల రూపాయల..

Guntur Crime: మ్యాట్రిమోనిలో పెళ్లి పేరిట ఘరానా మోసం.. రూ.ఏడున్నర లక్షలు తీసుకొని విదేశాలకు జంప్
Man Fled With Cash To Abroad
Follow us
T Nagaraju

| Edited By: Srilakshmi C

Updated on: Nov 01, 2023 | 1:00 PM

గుంటూరు, నవంబర్‌ 1: ఆమెది గుంటూరులోని ఆర్ అగ్రహారం. అతనిది గుంటూరులోనే హౌసింగ్ బోర్డు కాలనీ.. ఇద్దరికీ పరిచయం లేదు. కాని అనుకోకుండా మాట్రిమోనిల్లో ఒకరి బయో డేటా మరొకరు చూసి ఇష్టపడ్డారు. మొదట్లో అయిన పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత పెళ్లి వరకూ వెళ్లింది. అయితే హౌసింగ్ బోర్డుకు చెందిన సాత్విక్ తనను తాను స్థితిమంతుల బిడ్డగా పరిచయం చేసుకున్నాడు. తాను అమెరికాలో ఉంటున్నట్లు చెప్పాడు. అయితే మ్యాట్రిమోని సైట్లో పరిచయం అవ్వడంతో పెళ్లి ప్రపోజల్ కూడా తీసుకొచ్చాడు.

ఇద్దరిదీ గుంటూరు కావడం, ఒకరంటే మరొక ఇష్టపడటంతో స్వాతిక్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఫోన్ లోనే ఇద్దరూ అంగీకారానికి వచ్చారు. తరుచూ ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అయితే అతను ఓ రోజు ఫోన్ చేసి, అర్జంట్‌గా డబ్బులు కావాలని ఆమెను అడిగాడు. పెళ్లి కూడా కుదరటంతో ఆమె అతన్ని నమ్మింది. ఏకంగా ఏడున్నర లక్షల రూపాయల డబ్బులను అతనికి ఇచ్చింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వీరిద్దరి వివాహం ఈ రోజు జరగాల్సి ఉంది. అయితే ఏడున్నర లక్షల రూపాయల డబ్బులు తీసుకున్న తర్వాత సాత్విక్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి సాత్విక్ గురించి ఆరా తీయడమే కాకుండా విషయం మొత్తాన్ని ఆమె తల్లిదండ్రులకు, బంధువులకు చెప్పింది. దీంతో వారు కూడా సాత్విక్ గురించి వివరాలు సేకరించడం మొదలు పెట్టారు.

మొత్తానికి హౌసింగ్ బోర్డులోని సాత్విక్ ఇంటి అడ్రస్ పట్టుకొని అక్కడికే వెళ్లారు. అయితే సాత్విక్ స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లినట్లు ఆమె బంధువులకు తెలిసింది. ఆమె బంధువులు సాత్విక్ తండ్రితో పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పడమే కాకుండా ఆమె ఇచ్చిన డబ్బులు గురించి కూడా చెప్పారు. అయితే సాత్విక్ తండ్రి వారు చెప్పిన మాటలను కొట్టి పారేశారు. డబ్బులిచ్చేది లేదని తెగేసి చెప్పేశాడు.మరోవైపు సాత్విక్ తో ఫోన్ లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆమె మోస పోయినట్లు తెలుసుకుంది. గుంటూరు స్పందన కార్యక్రమంలో పెళ్లి పేరుతో మోసం చేసిన సాత్విక్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే విదేశాల్లో ఉన్న సాత్విక్ ను ఇండియాకు తీసుకురావడం అంత సులభం కాదని పోలీసులు అంటున్నారు. అయితే ఆమె డబ్బులిచ్చిన వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.