Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ అంతలో ఊహించని ట్విస్ట్‌!

సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నేలకోట గ్రామానికి చెందిన షణ్ముఖ నాయక్ , అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెంకటం పల్లి తండాకు చెందిన రవణమ్మ ప్రేమికులు. కొద్దికాలం కలిసి తిరిగిన తర్వాత విభేదాలు వచ్చాయి. రాజీ ప్రయత్నాలు జరిగిన ఫలించలేదు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉంటున్న అబ్బాయి షణ్ముఖ నాయక్, కర్నూలులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న రమణమ్మ దగ్గరికి..

Andhra Pradesh: ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ అంతలో ఊహించని ట్విస్ట్‌!
Young Man Died Suspiciously In Kurnool
Follow us
J Y Nagi Reddy

| Edited By: Srilakshmi C

Updated on: Nov 01, 2023 | 1:15 PM

గుంటూరు, నవంబర్‌ 1: కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ప్రేమికుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఉరివేసుకొని మృతి చెందాడని అమ్మాయి తరపు వారు ఆరోపిస్తుండగా.. లేదు అమ్మాయి, ఆమె కుటుంబానికి చెందిన వారే హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి, నిజానిజాలు వెల్లడించాలని అబ్బాయి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నేలకోట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నేలకోట గ్రామానికి చెందిన షణ్ముఖ నాయక్ , అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వెంకటం పల్లి తండాకు చెందిన రవణమ్మ ప్రేమికులు. కొద్దికాలం కలిసి తిరిగిన తర్వాత విభేదాలు వచ్చాయి. రాజీ ప్రయత్నాలు జరిగిన ఫలించలేదు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉంటున్న అబ్బాయి షణ్ముఖ నాయక్, కర్నూలులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న రమణమ్మ దగ్గరికి వచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఉరి వేసుకుని చనిపోయాడని, మృతదేహం ఆసుపత్రిలో ఉందని షణ్ముఖ నాయక్ పేరెంట్స్‌కి రమణమ్మ ఫోన్ చేసి చెప్పింది.

హుటాహుటిన కర్నూలు వచ్చిన షణ్ముఖ నాయక్ పేరెంట్స్ కన్నీటి పర్యంతమయ్యారు. రవణమ్మ ఆమె పేరెంట్స్ కలిసి చంపారని శవ పరీక్ష నిర్వహించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రమణమ్మ తో పాటు మరో ముగ్గురు కలిసి ఆసుపత్రిలో డెడ్ బాడీని పెట్టి వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. శవ పరీక్ష చేసేందుకు రమణమ్మ సంతకం అడుగుతున్నారని, ప్రస్తుతం ఆమె పరారీలో ఉందని అంటున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్, ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ లలో బాధితులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.