Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇన్‌స్టాలో పరిచయం.. ప్రియుడిని కలిసేందుకు ఒంటరిగా బయల్దేరిన మైనర్‌ బాలిక! అంతలో..

పుసులూరి లలిత కుమారి పల్నాడు జిల్లా శ్యావల్యాపురం ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ప్రతి రోజూ నర్సరావుపేట నుంచి శ్యావల్యాపురంకు బస్సులో ప్రయాణిస్తుంటారు. ఎప్పటిలాగే నిన్న కూడా ఆమె బస్సులో శ్యావల్యాపురం వెలుతున్నారు. అయితే బస్సులో ఆమె పక్కన సీటులో ఓ మైనర్ బాలిక ప్రయాణిస్తుంది. లలిత కుమారి టీచర్ కావడంతో ఆ బాలికతో మాటలు కలిపింది. ఆ బాలిక తనది విజయవాడ అని కర్నూలు వెలుతున్నానని లలిత కుమారికి చెప్పింది. అయితే మైనర్..

Andhra Pradesh: ఇన్‌స్టాలో పరిచయం.. ప్రియుడిని కలిసేందుకు ఒంటరిగా బయల్దేరిన మైనర్‌ బాలిక! అంతలో..
Minor Girl Going To Meet Her Boyfriend
Follow us
T Nagaraju

| Edited By: Srilakshmi C

Updated on: Nov 01, 2023 | 2:12 PM

శ్యావల్యాపురం, నవంబర్‌ 1: ఆ ఇద్దరూ ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యారు. కొన్నాళ్లకే వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రేమ పేరుతో పేకమేడలు కట్టాడు అతడు. అతడి మాయమాటలు నమ్మి పదో తరగతి చదువుతోన్న ఓ బాలిక ఒంటరిగా బస్సెక్కింది. బిక్కుబిక్కంటూ కూర్చున్న బాలికను ఎంఈవో అనూహ్యంగా అతడి చెర నుంచి కాపాడి రక్షించారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. పల్నాడు జిల్లా శ్యావల్యాపురం ఎంఈవో పుసులూరి లలిత కుమారి తెలిపిన వివరాల ప్రకారం..

పుసులూరి లలిత కుమారి పల్నాడు జిల్లా శ్యావల్యాపురం ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ప్రతి రోజూ నర్సరావుపేట నుంచి శ్యావల్యాపురంకు బస్సులో ప్రయాణిస్తుంటారు. ఎప్పటిలాగే నిన్న కూడా ఆమె బస్సులో శ్యావల్యాపురం వెలుతున్నారు. అయితే బస్సులో ఆమె పక్కన సీటులో ఓ మైనర్ బాలిక ప్రయాణిస్తుంది. లలిత కుమారి టీచర్ కావడంతో ఆ బాలికతో మాటలు కలిపింది. ఆ బాలిక తనది విజయవాడ అని కర్నూలు వెలుతున్నానని లలిత కుమారికి చెప్పింది. అయితే మైనర్ బాలిక ఒంటరిగా ప్రయాణిస్తుండటంతో ఆమె గుచ్చి గుచ్చి బాలికను ప్రశ్నించింది. మొదట తాను పదో తరగతి చదువుతున్నట్లు చెప్పిన ఆ బాలిక ఆ తర్వాత అసలు విషయం చెప్పింది.

తనకు ఇన్‌స్టాగ్రాంలో కర్నూలుకు చెందిన యువకుడు పరిచయం అయ్యాడని, అప్పటి నుంచి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పింది. అయితే ఆ యువకుడిని కలవటానికే తాను కర్నూలు వెలతున్నట్లు ఆ బాలిక చెప్పింది. దీంతో లలిత కుమారి ఆశ్చర్య పోయింది. మైనర్ బాలికకు ఎవరో మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె గ్రహించింది. అయితే మైనర్ బాలికతో మంచిగా మాట్లాడుతూనే అలా ఒంటరిగా వెళ్లకూడదని చెప్పింది. చిన్నగా తన మాటల్లోకి ఆ బాలికను దించుకున్న ఎంఈవో శ్యావల్యాపురంలోనే ఆ బాలికను తనతో పాటు దించుకుంది. అక్కడ నుంచి ఎంఈవో కార్యాలయానికి తీసుకెల్లి బాలికకు నచ్చజెప్పింది.

ఇవి కూడా చదవండి

కొంత సమయం గడిచాక ఎంఈవో బాలికను వెంటబెట్టుకొని శ్యావల్యాపురం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. అక్కడ ఎస్సై తిరుపతి రావు విషయం అంతా చెప్పింది. దీంతో పోలీసులు ఆ బాలికతో మాట్లాడి ఆమె తల్లిదండ్రుల ఫోన్ నంబర్ తీసుకున్నారు. వారికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో వారు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే శ్యావల్యాపురంకు బయలుదేరారు. అయితే బాలిక కర్నూలు వెళ్లకుండా అడ్డుకొని చిన్నారిని కాపాడిన ఎంఈవో లలిత కుమారిని స్థానికులు ప్రశంసించారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.