Viral Video: రోడ్డుపై ప్రయాణిస్తున్న విమానం.. ఆశ్చర్యంతో చూసేందుకు ఎగబడ్డ జనం.. వైరల్ వీడియో.!

ఆకాశంలో ఎగిరే విమానం ఒక్కసారిగా రోడ్డు మీద ప్రయాణిస్తే.. ఎలా ఉంటుంది.? అసలు విమానం ఏంటి.? రోడ్ల మీద కనిపించడం ఏంటి.? ప్రయాణించడం ఏంటి.? అని కన్ఫ్యూజన్ అవుతున్నారా.! ఒక్క నిమిషం ఆగండి. మీ బుర్రలో మెదులుతున్న ప్రశ్నలకు అన్నీ సమాధానాలు దొరుకుతాయి.

Viral Video: రోడ్డుపై ప్రయాణిస్తున్న విమానం.. ఆశ్చర్యంతో చూసేందుకు ఎగబడ్డ జనం.. వైరల్ వీడియో.!
Aeroplane Travelling On Roa
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Ravi Kiran

Updated on: Nov 01, 2023 | 12:35 PM

ఆకాశంలో ఎగిరే విమానం ఒక్కసారిగా రోడ్డు మీద ప్రయాణిస్తే.. ఎలా ఉంటుంది.? అసలు విమానం ఏంటి.? రోడ్ల మీద కనిపించడం ఏంటి.? ప్రయాణించడం ఏంటి.? అని కన్ఫ్యూజన్ అవుతున్నారా.! ఒక్క నిమిషం ఆగండి. మీ బుర్రలో మెదులుతున్న ప్రశ్నలకు అన్నీ సమాధానాలు దొరుకుతాయి. ఆకాశంలో ఉండాల్సిన విమానం రోడ్డుపైన ఉందంటే..? దానంతట అది రాలేదండీ.. ఓ భారీ ట్రక్కు రోడ్డుపైకి విమానాన్ని మోసుకొచ్చింది. ఇక దాన్ని చూసేందుకు భారీ జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇది జరిగింది మరెక్కడో కాదు.. మన తెలంగాణలో అది కూడా హైదరాబాద్‌లోనే.. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..

సహజంగా విమానం ఎక్కాలని ఎంతోమందికి కోరిక ఉంటుంది. కానీ ఎక్కేందుకు వారికి ఆర్ధిక పరిస్థితులు సరిపోకనో.. లేక కారణాలు వేరే ఏదైనా.. కేవలం దూరం నుంచే చూసి సంతోషిస్తుంటారు. ఇక కొంతమందికైతే జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలన్న కల ఉంటుంది. లేదా కనీసం దగ్గర నుంచైనా చూసి ఆనందించాలని అనుకుంటారు. అలాంటివారికి ఏకంగా రోడ్డుపైనే విమానం కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.! వారి ఆనందం అవధులు దాటుతుంది. అనంతపురంలోని కస్టమ్స్ ఏవియేషన్ అకాడమీ కాలేజీలో విద్యార్థుల అవగాహన కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అనంతపురంకు ఎయిర్ ఇండియా విమాన విడిభాగాలను రెండు భారీ ట్రక్కులలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు తరలించారు. మొత్తం 25 విడిభాగాలను ఆ భారీ ట్రక్కుల్లో అనంతపూర్‌కి చేరవేశారు.

రోడ్డు మార్గంలో ఈ విమానం శంషాబాద్ నేషనల్ హైవేకి చేరుకోగానే ప్రజలంతా దాన్ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. తెగ సంబరపడిపోయి.. దానితో సెల్ఫీలు దిగడమే కాదు.. ఆ విమానం వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తద్వారా విమానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. కాగా, విమానం పొడవు భారీస్థాయిలో ఉండడం వల్ల శంషాబాద్ జాతీయ రహదారిపైన ట్రక్కును రోడ్డు క్రాస్ చేయంచడానికి డ్రైవర్ తీవ్రంగా శ్రమించాడు. ఆ సమయంలో అక్కడంతా భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినట్టు తెలుస్తోంది. లేట్ ఎందుకు మీరూ ఆ విమానానికి సంబంధించిన వీడియోలపై ఓ లుక్కేసేయండి..

వీడియో ఇక్కడ చూసేయండి..