మనుషుల కంటే తోడేళ్లు ఎక్కువగా ఉండే గ్రామం.. అందులో ఒకే ఒక మహిళ నివసిస్తుంది..!

ఈ నిర్జన గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె తన ఇంటి కోసం సొంతంగా సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకుంది. దీంతో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసుకుంది. ఇక ఆమె 6 కిలోమీటర్ల దూరం నుండి నిత్యవసరాల కోసం కావాల్సిన రేషన్ తెచ్చుకుంటుంది. తాను లగ్జరీ లైఫ్ కోసం వెతకడం లేదని చెప్పింది జోసెట్‌. తను కేవలం శాంతియుత జీవన విధానం కోసం మాత్రమే ఇలా జీవిస్తున్నానని చెప్పింది. గ్రామంలో తాను ఒంటరిగా నివసిస్తున్నాను, కానీ తాను సన్యాసిని కాదు అని చెప్పింది. ఇక

మనుషుల కంటే తోడేళ్లు ఎక్కువగా ఉండే గ్రామం.. అందులో ఒకే ఒక మహిళ నివసిస్తుంది..!
Rochefourchat
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 01, 2023 | 4:24 PM

రోచెఫోర్చాట్ ఫ్రాన్స్‌లోని అతి చిన్న గ్రామం ఇది. దీనిని ‘మిడిల్ ఆఫ్ నోవేర్’ అని కూడా పిలుస్తారు. ఈ గ్రామ జనాభా ఒకే ఒక్కరూ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జోసెట్ అనే 65 ఏళ్ల మహిళ మాత్రమే ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆమె చాలా ధైర్యవంతురాలు, ఎందుకంటే ఈ గ్రామంలో మనుషుల కంటే తోడేళ్లే ఎక్కువ. ఇకపోతే, ఫ్రాన్స్‌లో 35,083 మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటిలో అతి చిన్న మునిసిపాలిటీ అయిన రోచెఫోర్చాట్‌లో ఒకే ఒక్క నివాసం ఉంది. మొత్తం గ్రామం కోట, పాత చర్చి, స్మశానవాటిక, పని చేయని టెలిఫోన్ బూత్, మూడు భవనాల శిధిలాలతో ఉంటుంది. ఈ భవనాలలో ఒకదాంట్లో జోసెట్‌ నివసిస్తన్నారు. తన ఇంటినే స్వర్గంగా భావిస్తున్న ఆమె.. 2005 నుండి ఒంటరిగానే ఉంటోంది.

జోసెట్ ప్రశాంతంగా, అజ్ఞాతంగా జీవించడానికి ఇష్టపడుతుంది. అందుకే ఈ నిర్జన గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె తన ఇంటి కోసం సొంతంగా సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకుంది. దీంతో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసుకుంది. ఇక ఆమె 6 కిలోమీటర్ల దూరం నుండి నిత్యవసరాల కోసం కావాల్సిన రేషన్ తెచ్చుకుంటుంది. తాను లగ్జరీ లైఫ్ కోసం వెతకడం లేదని చెప్పింది జోసెట్‌. తను కేవలం శాంతియుత జీవన విధానం కోసం మాత్రమే ఇలా జీవిస్తున్నానని చెప్పింది. గ్రామంలో తాను ఒంటరిగా నివసిస్తున్నాను, కానీ తాను సన్యాసిని కాదు అని చెప్పింది. ఇక జోసెట్‌కి తోడుగా ఒక కుక్క కూడా ఉంది. ఆమెతో పాటు కుక్క కూడా ఇదే గ్రామంలో నివసిస్తుంది. ఆమెకు ఆహారం అవసరమైనప్పుడు, ఆమె తన ఇంటికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుండి కొనుగోలు చేస్తుంది.

జోసెట్ కుటుంబీకులు కూడా ఆమెను ఆమెను చూసేందుకు అప్పుడప్పుడూ గ్రామానికి వస్తుంటారు. వారంతా కలిసి అడవి పందుల వేటకు వెళతారు. ఇకపోతే, ఈ గ్రామం నిండా తోడేళ్లుగా ఎక్కువగా తిరుగుతుంటాయని జోసెట్ చెప్పారు.  రోచెఫోర్‌చాట్‌లో మేయర్ జీన్-బాప్టిస్ట్ డి మార్టిగ్నీతో సహా మరికొందరు ఇంటి యజమానులు కూడా ఉన్నారు. కానీ, వారంతా ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే ఇక్కడకు వస్తుంటారు.. 15రోజుల తర్వాత తిరిగి వారంతా తమ తమ కార్యాకలాపాల కోసం వెళ్లిపోతుంటారు. కానీ, జోసెట్ మాత్రం ఇక్కడే నివాసం ఏర్పారచుకున్నారు.  ఏది ఏమైనప్పటికీ త్వరలో రోచెఫోర్‌చాట్ జీవన విధానం మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెల్లి మెల్లిగా జనాభా పెరుగుదల ప్రారంభమైంది. ఫ్రెంచ్ మీడియా ప్రకారం, మరికొందరు కొత్త నివాసితులు రోచెఫోర్చాట్‌ వెళ్లాలని యోచిస్తున్నందున గ్రామంలో జనాభా మూడు రెట్లు పెరిగిందని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..