AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖంపై మంగు మచ్చలతో ఇబ్బందిపడుతున్నారా..? ఇలాంటి ఇంటి చిట్కాలతో అందంగా మారిపోండి!

కొందరికి వంశపారంపర్యంగా ఈ సమస్య ఉంటే, మరికొందరికి సూర్యకిరణాల వల్ల పిగ్మెంటేషన్ సమస్య రావచ్చు. సాధారణంగా కొందరికి బుగ్గలపై, కొందరికి ముక్కుపై, మరికొందరికి ముఖం అంతా పిగ్మెంటేషన్ ఉంటుంది. దీని కోసం ఇక్కడ బెస్ట్, సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. మీరు ఇంట్లో ఉండే కొన్ని సాధారణ పదార్థాలను ఉపయోగించడం ద్వారా మీరు మంగు మచ్చల సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. పిగ్మెంటేషన్ సమస్యలకు కారణాలు ఏమిటి..? దీనికి పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం...

ముఖంపై మంగు మచ్చలతో ఇబ్బందిపడుతున్నారా..? ఇలాంటి ఇంటి చిట్కాలతో అందంగా మారిపోండి!
Pigmentation
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2023 | 2:58 PM

Share

మీ ముఖం ఎంత అందంగా ఉన్నా, మంగుమచ్చలు, పిగ్మెంటేషన్ మీ ముఖం అందాన్ని పాడు చేస్తుంది. సడెన్‌గా ముఖంపై వచ్చే మంగుమచ్చల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొందరు మానసికంగా కూడా కుంగిపోతుంటారు. శరీరంలో మెలనిన్ కంటెంట్ ఎక్కువగా, ఐరన్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. కొందరికి వంశపారంపర్యంగా ఈ సమస్య ఉంటే, మరికొందరికి సూర్యకిరణాల వల్ల పిగ్మెంటేషన్ సమస్య రావచ్చు. సాధారణంగా కొందరికి బుగ్గలపై, కొందరికి ముక్కుపై, మరికొందరికి ముఖం అంతా పిగ్మెంటేషన్ ఉంటుంది. దీని కోసం ఇక్కడ బెస్ట్, సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. మీరు ఇంట్లో ఉండే కొన్ని సాధారణ పదార్థాలను ఉపయోగించడం ద్వారా మీరు మంగు మచ్చల సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. పిగ్మెంటేషన్ సమస్యలకు కారణాలు ఏమిటి..? దీనికి పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం…

మంగు మచ్చలకు పచ్చిపాలు:

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో పాలు వాడుతుంటారు. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఒక చిన్న గిన్నెలో పాలు పోసి కాటన్ బాల్‌ను నానబెట్టండి. పాలలో నానబెట్టిన దూదిని రోజుకు రెండుసార్లు ముఖంపై నల్లటి మచ్చల మీద రాయండి. ఇలా రోజూ చేయడం వల్ల మీ ముఖం మృదువుగా, మచ్చలు లేకుండా మెరుస్తూ కనబడుతుంది.

ఇవి కూడా చదవండి

మంగుమచ్చలకు కలబంద:

ముఖ సౌందర్యాన్ని పెంచే సహజ ఔషధంగా కలబందను చెప్పుకోవచ్చు. మొటిమల సమస్య ఉన్నవారు ఈ కలబందను ముఖానికి పట్టిస్తే మొటిమల సమస్య తొలగిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం, కలబంద హైపర్పిగ్మెంటేషన్‌కు సమర్థవంతమైన చికిత్సగా కనుగొనబడింది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు మంగుమచ్చలు ఉన్న చోట స్వచ్ఛమైన అలోవెరా జెల్‌ను అప్లై చేయండి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల త్వరలో మంచి ఫలితాలు వస్తాయి.

మంగుమచ్చలకు బొప్పాయి:

బొప్పాయి పండులో పాపైన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్‌కు మంచి ఇంటి నివారణగా పని చేస్తుంది. తురిమిన బొప్పాయి రసాన్ని రోజూ ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే మచ్చలు లేని ముఖం మీ సొంతం అవుతుంది.

మంగు మచ్చలకు బంగాళదుంపలు:

బంగాళదుంపలలో కాటెకోలేస్ ఉంటుంది. ఇది ముఖాన్ని శుభ్రపరుస్తుంది. బంగాళాదుంప రసాన్ని ఉపయోగించడం వల్ల మొటిమలు, నల్ల మచ్చలు వంటి అనేక చర్మ సమస్యలను నయం చేయవచ్చు. బంగాళదుంప రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. తర్వాత 15 నిమిషాలు అలాగే ఉంచి ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నల్ల మచ్చలు పోయి ముఖ సౌందర్యం పెరుగుతుంది.

రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్‌తో మిక్స్ చేసి ముఖానికి స్మూత్‌గా మర్థన చేయటం వల్ల కూడా స్పష్టమైన చర్మాన్ని పొందవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
థియేటర్‌ స్టైల్ క్యారమెల్ పాప్‌కార్న్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోండి
థియేటర్‌ స్టైల్ క్యారమెల్ పాప్‌కార్న్‌.. ఇంట్లోనే ఇలా చేసుకోండి
మీరు వాడే కొబ్బరినూనె అసలైనదా.. కల్తీదా..?
మీరు వాడే కొబ్బరినూనె అసలైనదా.. కల్తీదా..?
పిల్లబచ్చాలు.. పెద్దపులిని వాళ్ల గడ్డపైనే ఎలా ఓడించారు?
పిల్లబచ్చాలు.. పెద్దపులిని వాళ్ల గడ్డపైనే ఎలా ఓడించారు?
ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు
ఆ ఇద్దరి వల్లే ఓడాం.. వెన్నంటూ ఉంటూ వెన్నుపోటు పోడిచారు
నేను డల్ గా ఉన్నప్పుడు ప్రతిసారి ఆ హీరో నుంచి మెసేజ్ వస్తుంది
నేను డల్ గా ఉన్నప్పుడు ప్రతిసారి ఆ హీరో నుంచి మెసేజ్ వస్తుంది
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్. ఒకేసారి 5 పథకాలు
రైతులకు కేంద్రం సూపర్ న్యూస్. ఒకేసారి 5 పథకాలు
పెళ్లయ్యాకే తిరిగిన జాతకం.. 9 వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్
పెళ్లయ్యాకే తిరిగిన జాతకం.. 9 వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్
బామ్మ వర్సెస్ కోతి ఫైట్.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు!
బామ్మ వర్సెస్ కోతి ఫైట్.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు!
కొత్త వాహనం కొంటే పూజ ఎందుకు చేస్తారు? వాహన పూజ వెనుక ఉన్న అసలు..
కొత్త వాహనం కొంటే పూజ ఎందుకు చేస్తారు? వాహన పూజ వెనుక ఉన్న అసలు..
కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా
కాకినాడ చిన్నారి జాహ్నవి ఇంటికి వచ్చిన కొత్త నేస్తం.. ఎవరో తెలుసా