AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇదిగో..

హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించే రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అధిక డిమాండ్ కారణంగా వందే భారత్ ట్రైన్ కోచ్‌ల సంఖ్యను 16 కి పెంచుతూ ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కాచిగూడ - యశ్వంత్‌పూర్ - కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 16 కోచ్‌లతో జులై 10 2025 నుంచి అందుబాటులో రానుంది.

Vande Bharat Express: హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇదిగో..
Vande Bharat Express
Shaik Madar Saheb
|

Updated on: Jul 07, 2025 | 4:13 PM

Share

హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించే రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అధిక డిమాండ్ కారణంగా వందే భారత్ ట్రైన్ కోచ్‌ల సంఖ్యను 16 కి పెంచుతూ ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 16 కోచ్‌లతో జులై 10 2025 నుంచి ప్రయాణికులకు అందుబాటులో రానుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ ప్రకటనలో తెలిపారు. 10.07.2025 నుంచి కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సామర్థ్యం 530 నుండి 1,128కి పెరగనుంది. రైలు నెం. 20703/20704 కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ మధ్య నడిడే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మొదట 08 కోచ్‌ల కూర్పుతో ప్రవేశపెట్టారు.. ఇందులో 01 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 07 చైర్ కార్లు ఉన్నాయి. సాధారణ సర్వీసులు ప్రవేశపెట్టినప్పటి నుండి, రైలు 100శాతం కంటే ఎక్కువ ప్రోత్సాహంతో స్థిరంగా నడుస్తోంది.

దీంతో ఈ రైలుకు పెరిగిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, రైల్వే ఇప్పటికే ఉన్న రైలు బోగిలు 08కి అదనపు కోచ్‌లను జత చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం, జూలై 10, 2025 నుంచి ప్రస్తుత 08 కోచ్‌ల సామర్థ్యంతో కాకుండా 16 కోచ్‌ల సామర్థ్యంతో రైలును నడపడానికి ప్రణాళికలు చేశారు. కొత్త కోచ్‌లతో 1024 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో 14 చైర్ కార్లు, 104 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో 02 ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగిలు అందుబాటులోకి రానున్నాయి.. మొత్తం 1128 ప్రయాణికులు సామర్థ్యంతో కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది..

కాగా.. 2023 సెప్టెంబర్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే.. అప్పటినుంచి ఈ రైలు అధిక డిమాండ్ తో పరుగులు తీస్తోంది. పెరిగిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని.. కోచ్ లను 16కు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ కోచ్‌ల రెట్టింపుతో, ఐటీ నగరాలైన హైదరాబాద్ – బెంగళూరు మధ్య ఇప్పుడు ఎక్కువ మంది రైలు ప్రయాణికులు వందే భారత్ రైలు సేవలను పొందగలరని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..