Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం..
Hyderabad drinking water supply alert: హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి జలమండలి బోర్డు పలు కీలక సూచనలు చేసింది. పలుచోట్ల సరఫరాలో అంతరాయం కలగనుందని, ప్రజలకు అలర్ట్ జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. పలు ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని జలమండలి అధికారులు కోరారు.

Hyderabad drinking water supply alert: హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి జలమండలి బోర్డు పలు కీలక సూచనలు చేసింది. పలుచోట్ల సరఫరాలో అంతరాయం కలగనుందని, ప్రజలకు అలర్ట్ జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1,2 & 3 పంపింగ్ స్టేషన్లకు నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేసే బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ (CT)ల స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. దీంతో నాసర్లపల్లి జలమండలి పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కెవి సబ్ స్టేషన్లకు తేదీ: 26.11.2025, బుధవారం రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.. 6 గంటల పాటు టీజీ ట్రాన్స్ కో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.
కావున తేదీ: 26.11.2025, బుధవారం రోజున జలమండలి సరఫరా చేసే కృష్ణా ఫేస్ -1,2 & 3 లలో కింద పేర్కొన్న డివిజన్ ప్రాంతాల్లో నీటి సరఫరాలో పాక్షిక అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఏం డివిజన్ నం-1: చార్మినార్
2. ఓ అండ్ ఏం డివిజన్ నం-2: వినయ్ నగర్
3. ఓ అండ్ ఏం డివిజన్ నం-3: బొజగుట్ట
4. ఓ అండ్ ఏం డివిజన్ నం-4: రెడ్ హిల్స్
5. ఓ అండ్ ఏం డివిజన్ నం-5: నారాయణ గూడ
6. ఓ అండ్ ఏం డివిజన్ నం-6: ఎస్ ఆర్ నగర్
7. ఓ అండ్ ఏం డివిజన్ నం-7: మారేడ్ పల్లి
8. ఓ అండ్ ఏం డివిజన్ నం-8: రియాసత్ నగర్
9. ఓ అండ్ ఏం డివిజన్ నం-9: కూకట్ పల్లి
10. ఓ అండ్ ఏం డివిజన్ నం-10: సాహెబ్ నగర్
11. ఓ అండ్ ఏం డివిజన్ నం-11: హయత్ నగర్
12. ఓ అండ్ ఏం డివిజన్ నం-13: సైనిక్ పురి
13. ఓ అండ్ ఏం డివిజన్ నం-14: ఉప్పల్
14. ఓ అండ్ ఏం డివిజన్ నం-15: హఫీజ్ పేట్
15. ఓ అండ్ ఏం డివిజన్ నం-16: రాజేంద్ర నగర్
16. ఓ అండ్ ఏం డివిజన్ నం-18: మణికొండ
17. ఓ అండ్ ఏం డివిజన్ నం-19: బోడుప్పల్
18. ఓ అండ్ ఏం డివిజన్ నం-20: మీర్ పేట్ డివిజన్ ప్రాంతాలు..
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని జలమండలి అధికారులు కోరారు.
