AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APK Files: ఇలాంటి మెస్సేజ్‌లు మీ ఫోన్‌కు వస్తున్నాయా..? ఒక్కసారి ఓపెన్ చేస్తే మీ పని ఖతమే.. బీ కేర్‌ఫుల్

సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా APK ఫైల్స్ మాయలో ప్రజలను పడేసి అడ్డంగా బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును కాజేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో వందల మంది దీని బారిన పడుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు.

APK Files: ఇలాంటి మెస్సేజ్‌లు మీ ఫోన్‌కు వస్తున్నాయా..? ఒక్కసారి ఓపెన్ చేస్తే మీ పని ఖతమే.. బీ కేర్‌ఫుల్
Apk Files
Venkatrao Lella
|

Updated on: Nov 24, 2025 | 5:27 PM

Share

సైబర్ నేరగాళ్లు ప్రజల సొమ్మును కొల్లగోట్టేందుకు నయా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. వాట్సప్, టెలిగ్రాం, ఇతర సోషల్ మీడియా యాప్స్‌లలో నకిలీ ఏపీకే ఫైల్స్ పంపించి మోసం చేస్తున్నారు. ఒకసారి ఈ ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. దీని ద్వారా యూజర్ల పర్సనల్ డేటాతో పాటు బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు. ఓటీపీలను యాక్సెస్ చేసి అకౌంట్లోని సొమ్ము కాజేస్తున్నారు. ఇలాంటి ఏపీకే ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ బయట వచ్చే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ ఫోన్ కంట్రోల్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతుందని హెచ్చరిస్తున్నారు సైబర్ పోలీసులు.

బ్యాంక్, ప్రభుత్వ సంస్థ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ నకిలీ ఏపీకే ఫైల్స్ తయారుచేస్తున్నారు. అధికారిక యాప్‌ల కంటే వీటి ద్వారా ఫాస్ట్‌గా సర్వీసులు ఉపయోగించుకోవడంతో పాటు ట్రాన్సక్షన్స్ చేస్తే అనేక ఆఫర్లు వస్తాయంటూ నమ్మిస్తున్నారు. TOChallan.apk, PMKisanYojana.apk, ElectricityBill.apk, HMWSSB.apk, Creditcard.apk, rewardpoints.apk లాంటి పేర్లుతో నకిలీ లింక్‌లు పంపిస్తున్నారు. కొంతమంది నిజమైన యాప్స్ అనుకుని వీటిని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో ఎస్ఎంఎస్, కాంటాక్ట్స్, నోటిఫికేషన్లు, స్క్రీన్ షేరింగ్ యాక్సెస్ అడుగుతున్నాయి. మీరు వాటికి అనుమతి ఇచ్చాలంటే ఇక ఫోన్‌లోని ఓటీపీలు, బ్యాంకింగ్ డీటైల్స్, ఇతర వివరాలన్నీ నేరగాళ్లు యాక్సెస్ చేసి డబ్బులు దొచేస్తున్నారు.

పోలీసుల సూచనలు

-గూగుల్ ప్లే స్టోర్ బయట వచ్చే APK ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు

-ప్రభుత్వ పథకాలు, క్యాష్‌బ్యాక్స్, కేవైసీ అప్డేట్స్ పేరుతో వస్తే నకిలీ లింక్‌లను ఓపెన్ చేయకండి

-ఏ యాప్ అయినా సరే ఓటీపీ, ఇతర వ్యక్తిగత వివరాలు అడిగితే ఇవ్వకండి

-అప్డేడెటెడ్ ఓఎస్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మీ ఫోన్‌ను సెక్యూర్‌గా ఉంచుకోండి

Follow Us