Hyderabad: ఒక తల పాము కాదు…రెండు తలల పాములకు మార్కెట్‌లో యమా డిమాండ్‌ అట..

ఒక తల పాము కాదు...రెండు తలల పాములకు మార్కెట్‌లో యమా డిమాండ్‌ అంట. అది ఇంట్లో ఉంటే చాలు కుబేరులైపోతారని, లక్షలు పోసి కొనేస్తున్నారు. ఇలా ప్రచారం చేసి పాములు అమ్ముతున్న ముఠాను మాదాపూర్‌ SOT పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad: ఒక తల పాము కాదు...రెండు తలల పాములకు మార్కెట్‌లో యమా డిమాండ్‌ అట..
A Two Headed Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 18, 2023 | 9:21 AM

హైదరాబాద్‌ శివారు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు తలల పాములను విక్రయిస్తున్న 9 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 1లక్ష 90వేల నగదు, 10 సెల్ ఫోన్స్, 2 కార్లు, రెండు తలల పాములు రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌నగర్‌లో నివాసం ఉంటూ నల్లమల అటవీ ప్రాంతం నుండి రెండు తలల పాములు తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు తలల పాములను పట్టుకొని ఇక్కడికి తీసుకు వచ్చి అమ్మకాలు చేస్తున్నారనే సమాచారంతో మాదాపూర్ SOT పోలీస్‌, అటవీశాఖ అధికారులు కలిసి దాడి చేసి పట్టుకున్నట్లు మియాపూర్ ఏసిపి నర్సింహరావు చెప్పారు.

పట్టుబడ్డ నిందితుల్లో సంగారెడ్డికి చెందిన చిన్నోల్ల మాణిక్ రెడ్డి, చిత్తూరుకు చెందిన కే. చంద్రశేఖర్, యుగంధర్, గోపాల్, ప్రసాద్, తమిళనాడుకు చెందిన V. భాస్కర్, T. నవీన్, కర్ణాటకకు చెందిన Md. బాషా, రమేష్, రాఘవేందర్, అంబర్ విజయ్, షేక్ సికిందర్ కలిసి రామచంద్రాపురం పరిధిలో పాముల అమ్మకాలు జరుపుతున్నారు. నిందితుల వద్ద నుండి రెండు పాములు, లక్షా 90వేల నగదు, రెండు కార్లు, 10 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.

రెండు తలల పాము ఇంట్లో ఉంటే కుబేరులవుతారన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని పోలీసులు సూచించారు. ఇలాంటివారు ఎవరైనా పాముల స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..