Hyderabad: ఆడుకుంటూ వెళ్లి ఆల్ అవుట్ లిక్విడ్ తాగిన ఏడాదిన్నర బాలుడు.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా..
ముద్దులొలికే మీ పసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. వారిని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకోండి. వారికి ఏం చేస్తే మంచిది.. ఏం చేస్తే ఇబ్బంది కలుగుతుంది అన్న విషయం తెలియదు. అందుకే పేరెంట్స్ అలెర్ట్‌గా ఉండాలి.
హైదరాబాద్ చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. చందానగర్ పీయస్ పరిధి తారానగర్‌కు చెందిన జుబేర్ కొడుకు అబ్బు జాకీర్ ఆడుకుంటూ అనుకోకుండా ఆల్ అవుట్ లిక్విడ్ తాగాడు. బాలుడి బట్టలపై ఆల్ అవుట్ లిక్విడ్ వాసన రావడంతో అనుమానం వచ్చి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
అందుకే ఒకటికి పదిసార్లు చెబుతున్నాం. పసి పిల్లలకు ఏమీ తెలీదు. ఇది మంచి, ఇది చెడు అని తేడాలు తెలియవు. వారిని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. ఒక వయస్సు వచ్చేవరకు కనిపెట్టుకుంటే ఉండాలి. పిల్లలు చిన్నతనంలో ఏది కనపడినా వెంటనే నోట్లు పెట్టుకుంటూ ఉంటారు. అందుకే కొంచెం అశ్రద్ద చేసినా ఇలానే కడుపు కోత, గుండె కోత మిగులుతుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి