AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటే ఊరుకోం.. బెంగాల్ ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఓటర్ల జాబితా సవరణ ఇప్పుడు పెను తుఫానును సృష్టిస్తోంది. కోటిన్నరకు పైగా ఓటర్ల పేర్లలో లాజికల్ ఎర్రర్స్ ఉన్నాయన్న వాదనల మధ్య అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రక్రియకు అడ్డంకులు సృష్టించవద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం స్పష్టం చేసింది.

ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటే ఊరుకోం.. బెంగాల్ ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్..
Supreme Court On West Bengal Voter List Revision
Krishna S
|

Updated on: Feb 09, 2026 | 9:40 PM

Share

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై సుప్రీంకోర్టు సోమవారం కీలక విచారణ చేపట్టింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో ఎటువంటి అడ్డంకులు సృష్టించబోమని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, న్యాయస్థానం దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘SIR ప్రక్రియను పూర్తి చేయడంలో ఉన్న అడ్డంకులను మేము తొలగిస్తామం. కానీ ఈ ప్రక్రియకు ఎటువంటి కొత్త ఆటంకాలు సృష్టించవద్దు. దీనిపై మేము చాలా స్పష్టంగా ఉన్నా్’’ అని ఆయన బెంగాల్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

నియామకాలపై న్యాయవాదుల ఆందోళన

ఈ కేసులో సీనియర్ న్యాయవాది డి.ఎస్. నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. EROలు క్వాసీ జ్యుడీషియల్ విధులను నిర్వహిస్తారని, వారికి తగిన శిక్షణ ఉండాలని ఆయన వాదించారు. కేవలం 64 మంది అధికారులకు మాత్రమే న్యాయనిర్ణేత అనుభవం ఉందని.. మిగిలిన వారిని వేతన సమానత్వం ఆధారంగా ఎంపిక చేయడం సరికాదని తెలిపారు. మరోవైపు మైక్రో అబ్జర్వర్ల పాత్రపై సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు. అయితే తుది నిర్ణయం తీసుకునే అధికారం EROలకే ఉంటుందని, అదనపు అధికారులు ఉండటం వల్ల నిర్ణయాల నాణ్యత పెరుగుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ముగియనున్న గడువు.. కోట్లలో వ్యత్యాసాలు

ఈ ప్రక్రియ ఆవశ్యకతను శ్యామ్ దివాన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫిబ్రవరి 14తో SIR ప్రక్రియ ముగియనుంది. ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం 7.08 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 1.36 కోట్ల మంది లాజికల్ ఎర్రర్స్ ఉన్న వర్గంలో ఉన్నారని ఆయన తెలిపారు. మరో 32 లక్షల మంది మ్యాపింగ్ కాలేదని కోర్టుకు వివరించారు. ఈ కేసుపై విచారణను కొనసాగిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటే ఊరుకోం.. బెంగాల్ ఓటర్ల జాబితాపై..
ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటే ఊరుకోం.. బెంగాల్ ఓటర్ల జాబితాపై..
చింతచిగురు చేపల పులుసు.. ఇలా చేసి తింటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు!
చింతచిగురు చేపల పులుసు.. ఇలా చేసి తింటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు!
నిధి కోసం అన్వేషణ.. OTTకి వచ్చేసిన సరికొత్త అడ్వెంచర్‌ థ్రిల్లర్
నిధి కోసం అన్వేషణ.. OTTకి వచ్చేసిన సరికొత్త అడ్వెంచర్‌ థ్రిల్లర్
డాక్టర్ అవతారం ఎత్తిన దోపిడి దొంగ.. వైద్యం పేరుతో బంగారం లూటీ..
డాక్టర్ అవతారం ఎత్తిన దోపిడి దొంగ.. వైద్యం పేరుతో బంగారం లూటీ..
ఏకంగా 19 ఏళ్ల యూవీ రికార్డు బద్దలు కొట్టేశాడు.. ఈ ప్లేయర్ ఎవరంటే
ఏకంగా 19 ఏళ్ల యూవీ రికార్డు బద్దలు కొట్టేశాడు.. ఈ ప్లేయర్ ఎవరంటే
ఆ సినిమా ప్లాప్ అయ్యాక రాత్రంతా ఏడ్చేసా..
ఆ సినిమా ప్లాప్ అయ్యాక రాత్రంతా ఏడ్చేసా..
నల్ల పసుపును ఎప్పుడైనా తిన్నారా? ఎన్ని సమస్యలను తగ్గిస్తుందంటే...
నల్ల పసుపును ఎప్పుడైనా తిన్నారా? ఎన్ని సమస్యలను తగ్గిస్తుందంటే...
ఇదేం బాధరా భగవంతుడా.. కడసారి వీడ్కోలుకు కన్నీటి కష్టాలు..
ఇదేం బాధరా భగవంతుడా.. కడసారి వీడ్కోలుకు కన్నీటి కష్టాలు..
వాట్సప్‌లో స్టన్నింగ్ ఫీచర్.. వెబ్ వెర్షన్‌లో కూాడా కాలింగ్
వాట్సప్‌లో స్టన్నింగ్ ఫీచర్.. వెబ్ వెర్షన్‌లో కూాడా కాలింగ్
బాబోయ్.. లక్కంటే ఈ ముద్దుగుమ్మదే.. వరుస ఆఫర్స్..
బాబోయ్.. లక్కంటే ఈ ముద్దుగుమ్మదే.. వరుస ఆఫర్స్..