AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numaish 2022: నేడు పునఃప్రారంభం కానున్న నుమాయిష్‌.. ఎప్పటివరకు కొనసాగుతుందంటే..

ఏళ్లుగా కాదు, దశాబ్దాలుగా హైదరాబాద్‌లో నుమాయిష్‌ (Numaish) నిర్వహిస్తోంది నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ.

Numaish 2022: నేడు పునఃప్రారంభం కానున్న నుమాయిష్‌.. ఎప్పటివరకు కొనసాగుతుందంటే..
Numaish
Basha Shek
| Edited By: |

Updated on: Feb 25, 2022 | 10:03 AM

Share

ఏళ్లుగా కాదు, దశాబ్దాలుగా హైదరాబాద్‌లో నుమాయిష్‌ (Numaish) నిర్వహిస్తోంది నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ. అలాగే ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభించింది. కానీ, కరోనా కారణంగా అర్ధాంతరంగా నుమాయిష్‌ను నిలిపేశారు నిర్వాహకులు. అయితే ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో పరిస్థితులు సాధారణంగా మారాయి. దీంతో నగరానికి మళ్లీ నుమాయిష్ జోష్ వచ్చింది. కరోనా కారణంగా వాయిదా పడ్డ అఖిల భారత 81వ పారిశ్రామిక ప్రదర్శన నూమాయిష్‌ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. వినోదం, విజ్ఞానంతో పాటు వస్తు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అనువైన ఈ ఎగ్జిబిషన్‌ను, ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 46 రోజుల పాటు సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు, ప్రభుత్వ సెలవు రోజుల్లో రాత్రి 11 వరకూ ఎగ్జిబిషన్‌ కొనసాగుతుందని చెబుతున్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ సోసైటీ ప్రతినిధులు.

కాగా ఈసారి నుమాయిష్‌లో సుమారు 1,600 స్టాళ్లు కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. అయితే సందర్శకులు కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు అధికారులు. మాస్క్‌, శానిటైజేషన్‌, థర్మల్‌ స్ర్కీనింగ్‌ తర్వాతే ఎగ్జిబిషన్‌కు అనుమతినిస్తారు. పిల్లలు, పెద్దలకు వినోదాన్ని కల్పించేందుకు అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. సందర్శకులు సేద తీరేందుకు ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. రోజూ సాయంత్రం సంగీత విభావరి కూడా ఉంటుంది. కేంద్ర, వివిధ రాష్ట్రాల స్టాళ్లతో పాటు, కశ్మీర్‌ ఉత్పత్తులకు నుమాయిష్‌ ప్రత్యేకం. ఈసారి నుమాయిష్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తామంటున్నారు నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వాహకులు.

Also Read: Russia Ukraine Crisis: రష్యా దాడులపై అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ..

Russia Ukraine Crisis: పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..

Jharkhand: నదిలో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..