Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad crime: పిచ్చి పిచ్చిగా అరుపులు.. తర్వాత విగతజీవిగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన చందానగర్(Chanda Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు...

Hyderabad crime: పిచ్చి పిచ్చిగా అరుపులు.. తర్వాత విగతజీవిగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన
Death
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 25, 2022 | 8:53 AM

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన చందానగర్(Chanda Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై మృతురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య(Murder) చేసి, అనుమానాస్పద మృతిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి దూబేకాలనీకి చెందిన వెంకటాచారి కార్పెంటర్‌ గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. కరోనా మహమ్మారి కారణంగా సంవత్సరంన్నర క్రితం మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా.. చిన్న కుమార్తె బాచుపల్లిలోని ఓ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఆరోగ్యం సరిగా లేకపోవడం తల్లి కూతురు వద్దకు వెళ్లింది. చిన్న కుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి వచ్చాడు. కాసేపయ్యాక సౌజన్య గట్టిగా అరిస్తూ కేకలు పెట్టిందని స్థానికులకు చెప్పారు. డాక్టర్ కు విషయం తెలిపి, పరీక్షించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధరించారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి..చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సౌజన్య ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది విజయ్‌ అని గుర్తించారు. విజయ్ స్థానికంగా ఓ సంస్థ నిర్వహిస్తున్నాడు. 8 నెలల ముందు సౌజన్య అక్కడ ఉద్యోగం చేసింది. కళాశాలకు వెళ్లాలని ఉద్యోగం మానేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సౌజన్య మృతిపై వారు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. విజయ్‌ ఇంటికి తాళం వేసి ఉందని, అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read

Radhe shyam: ‘ఈ అబ్బాయికి.. ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు’ ప్రభాస్ పై రొమాంటిక్‌ పూజ ప్రశ్న..! వీడియో

IND vs SL: తగ్గేదే లే అంటున్న రవీంద్ర జడేజా.. లైవ్‌ మ్యాచ్‌లో పుష్ప సీన్ చూపించిన ఆల్‌రౌండర్..

Bheemla Nayak Movie Release Live: మొదలైన భీమ్లా నాయక్‌ సందడి.. అమెరికాలో ఆకాశన్నంటుతోన్న ఫ్యాన్స్‌ సంబురాలు..