AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మానాన్న అనాథ ఆశ్రమం.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. దాతృత్వం చాటుకుంటున్న దాతలు

మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించే వారిని చేరదీసి, వారిని అక్కున చేర్చుకుంటోంది యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమం. వారికి ఆశ్రమ నిర్వాహకులు అన్నీ తామై..

అమ్మానాన్న అనాథ ఆశ్రమం.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. దాతృత్వం చాటుకుంటున్న దాతలు
Ammananna 1
Ganesh Mudavath
|

Updated on: Feb 25, 2022 | 12:34 PM

Share

మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించే వారిని చేరదీసి, వారిని అక్కున చేర్చుకుంటోంది యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమం. వారికి ఆశ్రమ నిర్వాహకులు అన్నీ తామై అవసరాలు తీరుస్తున్నారు. దాతలూ వారికి తోచినంత సహాయం చేస్తూ.. అండగా నిలుస్తున్నారు. ఈ ఆశ్రమంలో సుమారు 550 మందికి సేవలు అందిస్తున్నారు. వీరికి పూజలు, ప్రార్థనలు చేసేందుకు ప్రత్యేక ఆలయాల నిర్మాణానికి ఆశ్రమ నిర్వాహకులు శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని 12 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. సుమారు 550 మందికి సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దాతలు కూడా తమ వంతు సహాయసహకారులు అందిస్తున్నారు.

అయితే వారికీ ఓ పుణ్యక్షేత్రం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు రూ.30 కోట్లుతో నిర్మించే భవనాలకు.. ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు శంకర్ శంకుస్థాపన చేశారు. ఐదు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ఆయన అన్నారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా హాస్పిటల్, శివాలయం, అన్నదాన సత్రాలు నిర్మిస్తామని తెలిపారు. దాతలు తగినంత సహాయం చేసి.. దాతృత్వం చాటుకోవాలని కోరారు.

Also Read

భారీ ఎత్తున ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథులుగా స్టార్‌ హీరోయిన్లు..

ప్రియుడితో భార్య వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఆపై ఏం చేశాడంటే

Stock Market: భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కొనుగోళ్లు పెరగడమే కారణమా..