Stock Market: భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. కొనుగోళ్లు పెరగడమే కారణమా..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో గురువారం భారీ నష్టలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో మొదలయ్యాయి...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో గురువారం భారీ నష్టలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు(Stock Market) శుక్రవారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్(sensex) 1133 పాయింట్లు పెరిగి 55662 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ(Nifty) 350 పెరిగి 16597 వద్ద కొనసాగుతోంది. టాటా మోటర్స్, టాటా స్టీల్, యూపీఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్ స్టాక్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్రిటనియా, సిప్ల నష్టల్లో కొనసాగుతున్నాయి. గురువారం నాటి పతనాన్ని పెట్టుబడిదారులు ఒక అవకాశంగా భావించారు. దీంతో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన 5 నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా జంప్ నమోదు చేసింది.
U.S. అధ్యక్షుడు జో బిడెన్ ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత రష్యాపై కఠినమైన ఆంక్షలతో ఎదురుదెబ్బ తగలడంతో వాల్ స్ట్రీట్ రాత్రిపూట ఆధిక్యంతో ఆసియా షేర్లు తిరిగి పుంజుకున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 3.45 శాతం, స్మాల్ క్యాప్ షేర్లు 4.61 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు పాజిటివ్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్, నిఫ్టీ మెటల్ వరుసగా 4.85 శాతం, 3.85 శాతం పెరిగి ఇండెక్స్‌ను అధిగమించాయి.
Read Also.. Russia Ukraine war: అక్కడ బాంబుల మోత.. ఇక్కడ ధరల పెరుగుదల వాత.. భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర..