Russia Ukraine war: అక్కడ బాంబుల మోత.. ఇక్కడ ధరల పెరుగుదల వాత.. భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర..
రష్యా-ఉక్రెయిన్(Russia Ukraine war) మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు(Crude Oil) ధరలు అనూహ్యంగా పెరిగాయి...
రష్యా-ఉక్రెయిన్(Russia Ukraine war) మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు(Crude Oil) ధరలు అనూహ్యంగా పెరిగాయి. మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధరలకు 100 డాలర్లకు చేరుకుంది. పెరుగుతున్న ముడిచమురు ధరలు భారతదేశంలోని విధాన నిర్ణేతలకు తలనొప్పులు తీసుకువస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala sitharaman) కూడా ఆర్థిక వ్యవస్థపై ధరల పెరుగదల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా తన చమురు అవసరాలలో 80 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. ఇక ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంది.
ముడిచమురు ధరను బ్యారెల్‌కు 75 డాలర్లుగా ఉంచి లెక్కిస్తే బడ్జెట్‌కు ఏం జరుగుతుందో ఒక్కసారి ఉహిస్తే భయం కలుగుతుంది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో కూడా ధరలు తగ్గే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఇకపై ధరలు పెరగుతూనే ఉంటాయి. ప్రపంచ చమురు మార్కెట్‌లో రష్యా ఆధిపత్యం చెలాయిస్తున్నందున ఇలాంటి అంచనాలకు రాక తప్పడంలేదు. ఎందుకంటే రష్యా ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారు.ముడి చమురును ఉత్పాత్తి చేసే దేశాల్లో ప్రపంచంలో మూడో స్థానం రష్యాదే! రష్యా ప్రతి రోజు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తుంది. యూరప్‌లో 48 శాతం, ఆసియాలో 42 శాతం దేశాలు ముడి చమురు అవసరాలకు రష్యాపై ఆధారపడ్డాయి. అందువల్ల రష్యా నుంచి ముడి చమురు దిగుమతి ఒక ప్రధాన అంశంగా మారిపోయింది. ప్రస్తుతం చమురును ఎగుమతి చేసే దేశాల్లో సౌదీ అరేబియా ప్రపంచంలోనె మొదటి స్థానంలో ఉంది.
OPECతో (ఒపెక్) కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి సౌదీ అరేబియా అంగీకరించడం లేదు. ముడి చమురు ఉత్పత్తిని పెంచడానికి ఒప్పుకోవడం లేదు. దీని అర్థం ఆసియా, యూరప్‌లో ధరలు పెరుగుతాయి. ఈ పరిస్థితి దేశాలకు పెద్ద తలనొప్పి, కానీ దీనివలన చమురు ఆర్థిక వ్యవస్థలు చాలా ప్రయోజనం పొందుతాయి. ముడి చమురుతో పాటు, గ్యాస్ ధరలు కూడా ఎప్పుడైనా ఆకాశాన్ని తాకొచ్చు. ఒకవైపు చలికాలం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో పశ్చిమ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. మరోవైపు, తక్కువ ఇన్వెంటరీ సహజ వాయువు ధరలను పెంచుతోంది. ఇప్పుడు గ్యాస్ మార్కెట్‌పై రష్యా భారీ ప్రభావం చూపుతున్నందున పరిస్థితి క్లిష్టంగా మారొచ్చని తెలుస్తోంది.
ఇప్పుడు, అటువంటి ఊహాగానాలకు మరింత బలం చేకూర్చే కొన్ని అంశాలను చూద్దాం. రష్యా 2020లో 22 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల కంటే ఎక్కువ సహజ వాయువును ఉత్పత్తి చేసింది. 8.5 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువును ఎగుమతి చేసింది. యూరప్, యూరో ఆసియా దేశాలు ఈ గ్యాస్ ఎగుమతిలో దాదాపు 90 శాతం కొనుగోలు చేశాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెలారస్ ఎగుమతుల్లో సగానికి పైగా కొనుగోలు చేయడం అనేది యూరప్ తన గ్యాస్ అవసరాలను తీర్చడానికి రష్యాపై ఆధారపడటాన్ని చూపిస్తుంది. అందుకే, రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం ఐరోపాకు తీవ్రమైన సమస్య మారింది. గత 2 నెలల్లో గ్లోబల్ మార్కెట్‌లో గ్యాస్ ధర మూడింట ఒక వంతు పెరిగింది. డిసెంబరు చివరి నాటికి గ్యాస్ ధరలు యూనిట్‌కు 3.54 డాలర్ల నుంచి 4.86 డాలర్లకు పెరిగాయి. రష్యా చమురు, గ్యాస్‌లో మాత్రమే కాకుండా బొగ్గు, అణుశక్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీని అర్థం రష్యా ప్రపంచ ఇంధన మార్కెట్ చక్రాన్ని తిప్పుతుంది. పుతిన్ దానిని తన సొంత ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారు.
అందువలన ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడే భారతీయులు ఇప్పుడు ఖరీదైన ఆయిల్‌తోపాటు తాజా ఇబ్బందులను కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి. క్షీణిస్తున్న రూపాయితో ఖరీదైన చమురును కొనుగోలు చేయడం దేశానికి చాలా ఖర్చుతో కూడుకున్నది. మార్చి 7న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రభుత్వానికి పరిమితమైన అవకాశాలే ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇటువంటి సవాళ్లను స్వీకరించే సామర్థ్యం బడ్జెట్‌కు లేదు. దీని వలన మన ప్రజలు చమురు ద్రవ్యోల్బణాన్ని చాలా కాలం పాటు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Read also.. Billionaires Loss: రష్యా యద్ద బాంబ్.. నాలుగు గంటల్లో అపర కుబేరులకు మూడు లక్షల కోట్ల నష్టం