మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. మనోజ్‌కు తల్లి షాక్
మోహన్‌బాబు కుటుంబ వివాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మంచు మనోజ్‌కు ఆయన తల్లి నిర్మల షాకిచ్చింది. వివాదంలో తొలిసారి స్పందిస్తూ పోలీసులకు లేఖ రాసింది. శనివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాశారు.
ఆ రోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. మంచు విష్ణు తన ఇంట్లోని జనరేటర్‌లో షుగర్ వేశాడంటూ మనోజ్ చేసిన ఆరోపణలను తల్లి నిర్మలా దేవి ఖండించారు. మనోజ్ ఇచ్చిన కంప్లయింట్‌లో ఏ మాత్రం నిజం లేదన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన విష్ణు కేక్ కట్ చేయించటంతో పాటు తన సామాన్లు మాత్రమే తీసుకెళ్లాడని క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 14న తన పుట్టినరోజును విష్ణు సెలబ్రేట్ చేశాడు. జల్‌పల్లిలోని ఇంటికి కేకు తీసుకొచ్చాడు. అయితే ఈ విషయంపై మంచు మనోజ్.. విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నాకు ఫ్లాట్‌మేట్ కావాలి’.. బెంగళూరు యువతి పోస్ట్ వైరల్
ఇక ఏపీలో నాన్‌స్టాప్ గా వానలే వానలు
వ్యూస్ కోసం రైలు వస్తుండగా పట్టాలపై నిలబడిన మహిళ.. కట్ చేస్తే
జగన్నాథుడి విగ్రహం ముందు తల వంచి ప్రార్థించిన కోడి..
నదీ పై డ్యామ్ కట్టే ఎలుకలు !! వింతగా ఉందా ?? అయితే ఈ వీడియో ఒక లుక్ వేయండి