జగన్నాథుడి విగ్రహం ముందు తల వంచి ప్రార్థించిన కోడి..

జగన్నాథుడి విగ్రహం ముందు తల వంచి ప్రార్థించిన కోడి..

Phani CH

|

Updated on: Dec 19, 2024 | 6:47 PM

మనుషులతోపాటు కొన్నిసార్లు జంతువులు కూడా దేవుళ్ల పట్ల తమ భక్తిని చాటుతున్నాయి. ఇదే కోవలో ఒక కోడి జగన్నాథ స్వామి విగ్రహం ముందు వంగి మొక్కింది. ఆ దేవుడ్ని ప్రార్థించింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒడిశాలోని పూరిలో కొలువైన జగన్నాథుడ్ని ఆ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు దర్శిస్తుంటారు.

అలాంటి ఒడిశాలో ఒక వింత సంఘటన జరిగింది. ఒకచోట ఎత్తైన పీటపై జగన్నాథ స్వామి విగ్రహం ఉంది. ఒక కోడి అక్కడకు వచ్చింది. జగన్నాథ స్వామి విగ్రహం ముందు అది వంగి ప్రార్థించింది. కాగా, జగనాథుడ్ని భక్తితో నమస్కరించిన కోడి వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో జగన్నాథుడి భక్తులను ఇది ఎంతో ఆకట్టుకుంది. వారంతా ఆ కోడి భక్తికి ముగ్ధులయ్యారు. ‘విశ్వమంతా ఆయన ముందు తల వంచాలి. ఎందుకంటే ఆయనే విశ్వ సృష్టికర్త’ అని ఒకరు అన్నారు. ‘ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. నారాయణుడు ఏ రూపంలో ఉంటాడో ఎవరికీ తెలియదు. జగన్నాథ స్వామికి జై’ అని మరొకరు తన భక్తి భావాన్ని చాటారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నదీ పై డ్యామ్‌ కట్టే ఎలుకలు !! వింతగా ఉందా ?? అయితే ఈ వీడియో ఒక లుక్ వేయండి