నదీ పై డ్యామ్‌ కట్టే ఎలుకలు !! వింతగా ఉందా ?? అయితే ఈ వీడియో ఒక లుక్ వేయండి

నదీ పై డ్యామ్‌ కట్టే ఎలుకలు !! వింతగా ఉందా ?? అయితే ఈ వీడియో ఒక లుక్ వేయండి

Phani CH

|

Updated on: Dec 19, 2024 | 6:45 PM

ఇదిగో ఇక్కడ కనిపిస్తోందే ఈ డ్యామ్‌ కట్టేసరికి తలప్రాణం తోకకి వచ్చిందనుకో... అంటూ తోకను నిమురుకుంది ఓ పెద్ద ఎలుక. ముఖ్యంగా పిల్లర్ల కోసం ఆ పెద్ద దుంగలు నరికే సరికి.. సారీ కొరికే సరికి దుంప తెగిందనుకో అంది మరో మధ్య వయసు నారింజ పండ్ల ఎలుక. ఏదేమైనా అందరం కట్టగట్టుకొని ఆనకట్ట కట్టడం భలే ఆనందంగా ఉందబ్బా… ఇంక మన ఇళ్లకు ఏ కాలంలో అయినా సమస్యే లేదు అంది ఓ చిట్టి ఎలుక.

ఇదేమీ కార్టూన్‌ సినిమా కథ కాదండీ. నిజంగానే ఈ ఎలుకలు సమష్టిగా పనిచేసి నదుల దగ్గర డ్యామ్‌లు కడతాయి. జీవావరణ ఇంజినీర్లుగా వీటికి పేరుంది. ఇంతకీ ఇవి ఎందుకిలా చేస్తాయో చూద్దామా. ఈ ఎలుకలను బీవర్‌లుగా పిలుస్తారు. అమెరికాతో పాటు, యురేషియాలో ఎక్కువగా నివసించే వీటి నైపుణ్యాలు ఆశ్చర్యపరుస్తాయి. పారే నదులు, నదీ పాయలు, సెలయేళ్లలో ఇవి నివసిస్తాయి. డోమ్‌ల ఆకృతిలో ఉండే ఇళ్లను నిర్మించుకోవడం కోసం తామే ఆ ధారలో ఓ చోట మడుగులను ఏర్పాటు చేసుకుంటాయి. అందుకోసం నదీ ప్రవాహ వేగాన్ని తగ్గించేందుకు ముందుగా నీటి ప్రవాహం అంచున ఉన్న పెద్ద చెట్లను తన బలమైన నారింజ రంగు పళ్లతో కొరికి నేల కూలుస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్కలకూ షుగర్‌ వ్యాధి.. గుర్తించడం ఎలా ??

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

పెళ్లికొడుకుతో హద్దు మీరి మరదలు డాన్స్.. పెళ్లి కూతురు రియాక్షన్ !!

ఓరుగల్లు అబ్బాయి, ఇటలీ అమ్మాయిల ప్రేమ కథ.. క్లైమాక్స్ లో..

TOP 9 ET News: RRRను దాటేసిన పుష్ప రాజ్ | తండ్రి మాత్రమే కాదు.. అమ్మ కూడా విష్ణు పక్షమే