కుక్కలకూ షుగర్‌ వ్యాధి.. గుర్తించడం ఎలా ??

కుక్కలకూ షుగర్‌ వ్యాధి.. గుర్తించడం ఎలా ??

Phani CH

|

Updated on: Dec 18, 2024 | 1:42 PM

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య బాగా పెరిగిపోయినట్టు అధ్యయనాల్లో తేలింది. ఇప్పడు జంతువుల్లో కూడా ఈ వ్యాధి పెరుగుతోంది. అవును. పెంపుడు జంతువులు షుగర్‌ వ్యాధి బారిన పడుతున్నట్టు పశువైద్యులు చెబుతున్నారు. పెంపుడు శునకాలు, పందెపు ఎద్దుల్లో కొన్ని డయాబెటీస్ బారిన పడుతున్నట్టు వైద్యులు తెలిపారు.

గతంలో ఇవి ఒక్క శాతం ఉంటే ఇప్పుడది ఐదుశాతానికి పెరిగినట్లు పశు వైద్యులు తెలిపారు. సాధారణంగా కుక్క రక్తంలో 76 ఎంజీ/డిఎల్ నుండి 119 ఎంజీ/డిఎల్ వరకూ షుగర్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని కుక్కల్లో 120 నుంచి 160 ఎంజీ/డిఎల్ వరకూ షుగర్ ఉన్నట్లు గుర్తించారు. అధిక మోతాదులో షుగర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇటువంటి కుక్కల్లో ఎక్కువగా నీళ్లు తాగడం, మూత్ర విసర్జన అతిగా చేయడం, కంటి చూపు మందగించడం, ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలను వైద్యులు గుర్తించారు. ప్రధానంగా షుగర్ వ్యాధి ప్రబలడానికి పిజ్జాలు, బర్గర్ లు పెట్డడంతో పాటు కూల్ డ్రింక్స్ తాగించడం, శారీరక శ్రమ లేకుండా చూసుకోవడం అని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు వయస్సు రీత్యా కూడా షుగర్ వస్తున్నట్లు గుర్తించారు. సాధారణంగా ఐదేళ్ల వయస్సు తర్వాత కుక్కులు షుగర్ వ్యాధి బారిన పడుతున్నాయన్నారు. కుక్కలతో పాటు పందెపు ఎద్దుల్లోనూ షుగర్ వ్యాధిని గుర్తించారు. మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన ఎద్దుల్లో అధిక మోతాదులో షుగర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

పెళ్లికొడుకుతో హద్దు మీరి మరదలు డాన్స్.. పెళ్లి కూతురు రియాక్షన్ !!

ఓరుగల్లు అబ్బాయి, ఇటలీ అమ్మాయిల ప్రేమ కథ.. క్లైమాక్స్ లో..

TOP 9 ET News: RRRను దాటేసిన పుష్ప రాజ్ | తండ్రి మాత్రమే కాదు.. అమ్మ కూడా విష్ణు పక్షమే

వీడెవడండి బాబూ !! చిన్న విషయానికే చేతి వేళ్లు నరుక్కున్నాడు !!