ఓర్నీ.. ఆ ఫైనాన్స్‌ కంపెనీలు ఆత్మలకు కూడా లోన్లు ఇస్తాయా ??

ఓర్నీ.. ఆ ఫైనాన్స్‌ కంపెనీలు ఆత్మలకు కూడా లోన్లు ఇస్తాయా ??

Phani CH

|

Updated on: Dec 18, 2024 | 1:44 PM

మోసపోయే వాళ్లు ఉన్నంత వరకూ మోసగించేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. పేదవాళ్ల అవసరాలను అవకాశాలుగా చేసుకొని నిలువునా ముంచేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఫైనాన్స్‌ కంపెనీలో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఫేక్‌ డాక్యుమెంట్లతో, బినామీ పేర్లతో కోట్ల రూపాయలు కాజేశాడు. లోను రికవరీ కోసం ఏజెంట్లు సదరు వ్యక్తుల ఇంటికి వెళ్లగా అసలు బండారం బయటపడింది.

ఈ ఘనుడు ఏకంగా చనిపోయినవారి పేరుమీద లోను తీసుకొని సంస్థకు పెద్ద షాకిచ్చాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కత్తరశాల, కిష్టంపేట గ్రామాలలోని పలువురు వ్యక్తులతోపాటు, మృతిచెందినవారి పేరున కూడా లోన్లు తీసుకున్నాడు కత్తరశాల గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి . చోళా ఫైనాన్స్ సంస్థలో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను పలువురి పేరుమీద గృహ రుణాలు తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవలే ఆ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది కిష్టంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయన పేరున ఉన్న రూ.25 లక్షలకు సంబంధించిన మంత్లీ ఈఎంఐ చెల్లించాలని కోరగా.. ఆ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. రెండేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి‌ ఇప్పుడు లోన్ తీసుకోవడం ఏంటని లోన్ రికవరీ ఏజెంట్లను నిలదీశారు. దీంతో ఆందోళనకు‌ గురైన రికవరీ ఏజెంట్లు సంస్థలో ఆరా తీయగా కత్తరశాల గ్రామానికి చెందిన తమ సంస్థ ఉద్యోగి ప్రవీణ్.. దాదాపు 15 మంది పేరున ఇదే స్టైల్‌లో లోన్లు‌ తీసుకున్నాడని.. ఏకంగా ఆరు కోట్ల పైగా అక్రమంగా రుణాలు పొందాడని‌ తేలింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్కలకూ షుగర్‌ వ్యాధి.. గుర్తించడం ఎలా ??

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

పెళ్లికొడుకుతో హద్దు మీరి మరదలు డాన్స్.. పెళ్లి కూతురు రియాక్షన్ !!

ఓరుగల్లు అబ్బాయి, ఇటలీ అమ్మాయిల ప్రేమ కథ.. క్లైమాక్స్ లో..

TOP 9 ET News: RRRను దాటేసిన పుష్ప రాజ్ | తండ్రి మాత్రమే కాదు.. అమ్మ కూడా విష్ణు పక్షమే