ఎముకలు కొరికే చలి...ఇంకా ఎన్నాళ్లు ??

ఎముకలు కొరికే చలి…ఇంకా ఎన్నాళ్లు ??

Phani CH

|

Updated on: Dec 19, 2024 | 8:02 PM

"బాబోయ్ చలి.." నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట. చలిభయంతో బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్న పరిస్థితి. అదే సమయంలో ఆరోగ్య శాఖ నుంచి కూడా హెచ్చరికలు వస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే అంటున్నారు..వైద్యులు. దేశవ్యాప్తంగా శీతల గాలులకు గత పదేళ్లలో 800 మందికిపైగా మృతి చెందారని నివేదికలు చెబుతున్నాయి.

మరి చలిపులి పంజా నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి..? వైద్యులు ఏమంటున్నారు.? తెలుగు రాష్ట్రాలపై చలిపులి..పంజా విసురుతోంది. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కీసర గురుకులంలో ఎలుకల కలకలం

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల

మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. మనోజ్‌కు తల్లి షాక్‌

‘నాకు ఫ్లాట్‌మేట్‌ కావాలి’.. బెంగళూరు యువతి పోస్ట్‌ వైరల్‌

ఇక ఏపీలో నాన్‌స్టాప్ గా వానలే వానలు