తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Phani CH

|

Updated on: Dec 19, 2024 | 7:50 PM

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమాల, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను టీటీడీ ఈ నెల 18న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. సేవా టికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం డిసెంబరు 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్ఛు.

సేవా టిక్కెట్లు పొందినవారు.. డిసెంబరు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లిస్తే.. లక్కీడిప్‌ లో టికెట్లు మంజూరవుతాయి. టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబ‌రు 21 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. మార్చి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు 23 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. మనోజ్‌కు తల్లి షాక్‌

‘నాకు ఫ్లాట్‌మేట్‌ కావాలి’.. బెంగళూరు యువతి పోస్ట్‌ వైరల్‌

ఇక ఏపీలో నాన్‌స్టాప్ గా వానలే వానలు

వ్యూస్ కోసం రైలు వస్తుండగా పట్టాలపై నిలబడిన మహిళ.. కట్ చేస్తే

జగన్నాథుడి విగ్రహం ముందు తల వంచి ప్రార్థించిన కోడి..