కీసర గురుకులంలో ఎలుకల కలకలం
ఖమ్మంలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థినిని ఎలుకలు కరిచాయి. ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన ఎస్.లక్ష్మీ భవాని కీర్తి ఖమ్మం శివారులోని దానవాయిగూడెం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం తన కాళ్లు, చేతులు లాగుతున్నాయని ఫోన్ చేసి చెప్పడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆమె తల్లి తెలిపింది.
తన కుమార్తెకు కుడి కాలు, ఒక చెయ్యి చచ్చుబడిపోయాయని.. గురుకులంలో రెండేళ్లుగా నాలుగుసార్లు ఎలుకలు కరవడమే ఇందుకు కారణమని ఆమె ఆరోపించారు. ఈ విషయమై గురుకులం ఆర్‌సీఓను వివరణ కోరగా.. బాలికను ఫిబ్రవరిలో ఎలుకలు కరిస్తే రేబిస్ ఇంజెక్షన్ వేయించామని, కోలుకుందని తెలిపారు. ఇదిలా ఉండగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. కీసరలోని గురుకులంలో ఆదివారం రాత్రి నిద్రపోయిన తర్వాత తమ చేతి వేళ్లను కరిచినట్టు విద్యార్థినులు తెలిపారు. పాఠశాల సిబ్బంది సోమవారం ఉదయం విద్యార్థినులను కీసరలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా టికెట్లు విడుదల
మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. మనోజ్‌కు తల్లి షాక్
‘నాకు ఫ్లాట్‌మేట్ కావాలి’.. బెంగళూరు యువతి పోస్ట్ వైరల్
ఇక ఏపీలో నాన్‌స్టాప్ గా వానలే వానలు
వ్యూస్ కోసం రైలు వస్తుండగా పట్టాలపై నిలబడిన మహిళ.. కట్ చేస్తే