Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2024: ఈ సంవత్సరంలో ప్రపంచ స్థాయిలో దృష్టిని ఆకర్షించిన ఇస్రో సాధించిన విజయాలు ఇవే..

మనమందరం ఈ సంవత్సరం చివరి నెలలోకి ప్రవేశించాము. దీంతో 2024కి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టనున్నాం. ఇప్పటికే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది కూడా ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే అంతరిక్షంలో ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించి భారతీయులు గర్వపడేలా చేసింది. 2024లో ఇస్రో సాధించిన విజయాలు ఏమిటి? ఏయే శాటిలైట్‌లను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారో పూర్తి సమాచారం.

Year Ender 2024: ఈ సంవత్సరంలో ప్రపంచ స్థాయిలో దృష్టిని ఆకర్షించిన ఇస్రో సాధించిన విజయాలు ఇవే..
Isro
Follow us
Surya Kala

|

Updated on: Dec 19, 2024 | 9:19 PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భారతదేశానికి గర్వకారణం. గత సంవత్సరం చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో పాటు అనేక ముఖ్యమైన విజయాలతో ఇస్రో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అయితే ఇస్రో 2024 అనేక విజయాలను సాధించింది. చంద్రయాన్ తోనే ప్రపంచాన్ని తనవైపుకి తిప్పుకున్న ఇస్రో.. తన విజయాల పరంపరను కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా అనేక విషయాలను సొంతం చేసుకుంది. ఈ విజయాల కారణంగా ఇప్పటికే ప్రపంచ స్థాయిలో దృష్టిని ఆకర్షించింది. ఇస్రో ఈ ఏడాది సాధించిన విజయాల జాబితా ఏమిటంటే..

  1. 2024 మొదటి రోజు ఉపగ్రహాన్ని ప్రయోగించి చరిత్ర సృష్టించడంలో భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) విజయం సాధించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇస్రో జనవరి 1, 2024న PSLV-C58/ExpoSatని ప్రయోగించింది. అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్ ద్వారా వెలువడే ఎక్స్-కిరణాల మూలాన్ని అధ్యయనం చేసే లక్ష్యంతో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C58) రాకెట్ తన 60వ మిషన్‌లో పేలోడ్ ‘ఎక్స్‌పోశాట్’తో సహా మరో 10 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్ళింది.
  2. 2024లో ఇస్రో ఇన్‌శాట్-3డీఎస్ అనే వాతావరణ సూచన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. INSAT-3DS ఉపగ్రహాలు వివిధ వాతావరణ వర్ణపట మార్గాలను ఉపయోగిస్తాయి. దీని ద్వారా భూమి ఉపరితలాన్ని, సముద్రాన్ని పరిశీలించేందుకు ప్రయత్నిస్తుంది. వివిధ డేటా సేకరణ వ్యవస్థల నుంచి వాతావరణ సంబంధిత సమాచారాన్ని సేకరించడానికి ఇది భాగస్వామ్యం చేయబడింది.
  3. ఇస్రో తన కొత్త ఉపగ్రహాన్ని (SSLV-D3-EOS-08) 16 ఆగస్టు 2024న విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ భూ పరిశీలన కోసం వెళ్ళిన కొత్త ఉపగ్రహం EOS-8ని మోసుకెళ్లింది. దీనితో పాటు SR-0 డెమోశాట్ అనే చిన్న ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ రెండు ఉపగ్రహాలు విపత్తుల అంచనాను అందించే లక్ష్యంతో ప్రయోగించబడ్డాయి. భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నాయి.
  4. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు భారతదేశం గర్వించదగ్గ అంతరిక్ష సంస్థ ఇస్రో పంపిన ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌక ఈ ఏడాది తన తొలి ప్రభ కక్ష్యను పూర్తి చేసింది. ఆదిత్య-L1 మిషన్, లాగ్రాంజియన్ పాయింట్ L1 వద్ద భారతదేశపు మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీ గత సంవత్సరం సెప్టెంబర్ 2, 2023న ప్రారంభించబడింది. అయితే ఈ సంవత్సరం ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌక తన మొదటి హాలో ఆర్బిట్‌ను పూర్తి చేసింది. ఇది ISROకి మరో పెద్ద విజయం అని చెప్పవచ్చు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..