గుడిలో సందడి చేసిన రోబో ఏనుగు.. క్యూ కట్టిన భక్తులు.. చెవులు, తోక ఊపుతూ తొండంతో ఆశీర్వాదం
3 మీటర్ల పొడవు, 800 కిలోగ్రాముల బరువున్న ఈ యాంత్రిక ఏనుగులను రబ్బరు, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్, స్టీల్‌తో తయారు చేశారు. చెవులు ఊపుతూ పెద్ద తొండంతో అచ్చం పెద్ద ఏనుగు మాదిరిగా ఉన్న ఈ రోబో ఎలిఫేంట్‌కు పూజలు, హారతులతో స్వాగతం పలికారు. అలాగే రోబో ఏనుగు ముందు ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.

రోబోలు మన రోజువారీ జీవితంలో ఎక్కువగా కలిసిపోతున్నాయి. పనులను ఆటోమేట్ చేయడం, సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పరిశ్రమలు, వర్క్‌ఫ్లోలను పునర్నిర్మిస్తున్నాయి. ఇప్పుడు కేరళలో ఒక అడుగు ముందుకు వేసి దేవాలయాల్లో వేడుకలను ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి మొట్టమొదటి రోబోటిక్ ఏనుగును ప్రవేశపెట్టాయి. అవును మీరు చదివింది నిజమే..కేరళలోని ఒక ఆలయం వద్ద రోబో ఏనుగు సందడి చేసింది. భారీ ఏనుగును పోలి ఉన్న రోబోటిక్ ఏనుగును అచ్చంగా అసలు ఏనుగును తలపించింది. చెవులు, తోక ఊపడంతోపాటు భక్తులను తొండంతో ఆశీర్వదించింది. అందరినీ ఆకట్టుకుంటున్న రోబో ఏనుగుతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సాధారణంగా కేరళలో జరిగే ఆలయ ఉత్సవాల్లో ఏనుగులను వినియోగిస్తారు. అయితే కొన్నిసార్లు ఏనుగులు ఆగ్రహం చెందడంతో ఊహించని సంఘటనలు, అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. కాగా, ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు జంతు సంక్షేమ సంస్థ (పెటా) చొరవ చూపింది. పెరుంకడవిలాలోని బాలభద్రకాళి క్షేత్రం ట్రస్ట్‌కు రోబో ఏనుగును విరాళంగా ఇచ్చింది. 3 మీటర్ల పొడవు, 800 కిలోగ్రాముల బరువున్న ఈ యాంత్రిక ఏనుగులను రబ్బరు, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్, స్టీల్‌తో తయారు చేశారు. చెవులు ఊపుతూ పెద్ద తొండంతో అచ్చం పెద్ద ఏనుగు మాదిరిగా ఉన్న ఈ రోబో ఎలిఫేంట్‌కు పూజలు, హారతులతో స్వాగతం పలికారు. అలాగే రోబో ఏనుగు ముందు ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.
అచ్చం ఏనుగును పోలిన రోబో ఏనుగుకు సంబధించిన వీడియోను పెటా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆలయ సంప్రదాయాల్లో ఒక ముందడుగుగా అభివర్ణించింది. ‘దేవీ దాసన్.. సాంకేతిక అద్భుతం. బలభద్రకాళి క్షేత్రానికి చేరుకున్నది. భవిష్యత్తులో నిజమైన ఏనుగులు వాటి సహజ ఆవాసాలలో స్వేచ్ఛగా ఉండేలా ఇది చూస్తుంది. ఇది ఒక చారిత్రక మలుపు’ అని పేర్కొంది. వీడియో చూసిన ఇంటర్‌నెట్ వినియోగదారులు సైతం పెటా చొరవను ప్రశంసించారు.
ఇదిగో ఆ అందమైన వీడియో ఇక్కడ చూడండి..
A breakthrough in temple traditions!
Devi Dasan is a technological wonder that allows elephants to stay in their jungle homes, where they belong. 🌿🐘@paro_nair #MechanicalElephant #RoboticDeviDasan #PETAIndia pic.twitter.com/nNQajiig6c
— PETA India (@PetaIndia) March 7, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..