Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది మానవుడా లేక ఎలుగుబంటినా? ప్రమాదకరమైన సిండ్రోమ్‌తో పోరాడుతున్న భారతీయ బాలుడు

భారతదేశానికి చెందిన 18 ఏళ్ల లలిత్ పాటిదార్ అనే వ్యక్తి అత్యంత వెంట్రుకల ముఖం కలిగి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అతని ముఖం మీద చదరపు సెంటీమీటర్ చర్మానికి 201.72 వెంట్రుకలు ఉన్నాయని తెలుసుకుని అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ పరిస్థితి ఒక బిలియన్ మందిలో ఒకరికి మాత్రమే సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

అది మానవుడా లేక ఎలుగుబంటినా? ప్రమాదకరమైన సిండ్రోమ్‌తో పోరాడుతున్న భారతీయ బాలుడు
Hairiest Face
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 11, 2025 | 1:28 PM

మీరు ప్రపంచంలో వివిధ రకాల వ్యక్తులను చూసి ఉంటారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. కానీ మనిషి ఎలుగుబంటిలా మారిపోయే వ్యాధి గురించి మీరు ఎప్పుడైనా చదివారా లేదా విన్నారా? లేకపోతే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి..! ఈ వీడియోలో 90 శాతం శరీరం జుట్టుతో మాత్రమే కప్పబడి ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యాధికి సంబంధించి ఆయన ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించారు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

భారతదేశానికి చెందిన 18 ఏళ్ల లలిత్ పాటిదార్ అనే వ్యక్తి అత్యంత వెంట్రుకల ముఖం కలిగి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అతని ముఖం మీద చదరపు సెంటీమీటర్ చర్మానికి 201.72 వెంట్రుకలు ఉన్నాయని తెలుసుకుని అధికారులు ఆశ్చర్యపోయారు. హైపర్ ట్రైకోసిస్ అనే అరుదైన జుట్టు పెరుగుదల వ్యాధితో బాధపడుతున్న తర్వాత లలిత్ పాటిదార్ ఈ రికార్డును నెలకొల్పారు. ఈ వ్యాధిని “వోల్ఫ్ సిండ్రోమ్” అని కూడా అంటారు. ఈ పరిస్థితి ఒక బిలియన్ మందిలో ఒకరికి మాత్రమే సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మధ్య యుగాల నుండి ఇప్పటి వరకు దాదాపు 50 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

పాటిదార్ ముఖంలో 90% కంటే ఎక్కువ జుట్టుతో కప్పబడి ఉంది. చిన్నప్పటి నుండి ఇది ఇలాగే ఉంది. స్కూల్లో ఇతర పిల్లలు అతన్ని చూసి భయపడేవారు. కానీ వారు అతని గురించి తెలుసుకుని మాట్లాడటం ప్రారంభించారు. అయితే వారికంటే అంత భిన్నంగా లేనని, బయటకు భిన్నంగా కనిపిస్తున్నా, కానీ లోపల భిన్నంగా లేనని వారు గ్రహించారు” అని అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటిదార్ చెప్పాడు. ప్రజలు ఇప్పటికీ కొన్నిసార్లు తన ముఖం మీద ఉన్న వెంట్రుకలను తీసివేయమని సూచించారన్నారు. “దీని గురించి ప్రజలకు పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. నా లుక్స్ నాకు నచ్చాయని, నా లుక్ మార్చుకోవాలనుకోవడం లేదు అని తెలిపాడు. ప్రస్తుతం అతని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..