ఈ మసాలా టీ మగవారికి వరం.. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఊహించని లాభాలు..
మనం ప్రతి నిత్యం వంటల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. అవి ఆహారానికి మంచి రుచిని మాత్రమే కాదు..పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. దాల్చిన చెక్క అలాంటి మసాలా దినుసులలో ఒకటి. దాల్చిన చెక్కతోనూ అనేక లాభాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల చాలా సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. డయాబెటిస్ నియంత్రణ నుంచి బరువు తగ్గడం వరకు దాల్చిన చెక్క నీరు అద్భుత ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Mar 11, 2025 | 8:07 AM

దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న దాల్చిన చెక్క శరీరంలో మంటను తగ్గించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దాల్చిన నీళ్లను తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తగ్గుతాయి.

దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దాల్చిన నీళ్లు మెటాబలిజం రేటును కూడా పెంచుతాయి. బరువు తగ్గడానికి, కొవ్వు కరగడానికి దాల్చిని నీళ్లు బాగా పనిచేస్తాయి. రెగ్యులర్‌గా దాల్చిన చెక్క నీటిని తాగితే వేగంగా బరువు తగ్గొచ్చు.

దాల్చిన చెక్క నీళ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మంట, వాపు వంటి సమస్యలను సులువుగా పోగొడతాయి. ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. దాల్చినచెక్క నీళ్లను తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. గుండెకు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

దాల్చిన చెక్క నీళ్లలో యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పెంచుతాయి. ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాల్చిన నీళ్లను తాగడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

దాల్చిన చెక్కలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంటు వ్యాధులు, వ్యాధుల నుండి మీ శరీరాన్ని కాపాడతాయి. దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా నియంత్రించవచ్చు. ఇందుకోసం ఒక కప్పు నీళ్లను బాగా మరిగించి అందులో దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తాగితే ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.





























