Parliament Scuffle: పార్లమెంట్‌ ఎదుట కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీల మధ్య ఘర్షణ.. రాహుల్ గాంధీపై కేసు

రాహుల్‌గాంధీ తనపై దాడి చేశాడని తీవ్రంగా గాయపడ్డ బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సారంగి ఆరోపించారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాహుల్‌గాంధీపై స్పీకర్‌కు బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అయితే తాను ఎవరిపై దాడి చేయలేదన్నారు రాహుల్‌గాంధీ.. అంతేకాకుండా పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసుస్టేషన్‌లో రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ ఫిర్యాదు చేశారు.

Parliament Scuffle: పార్లమెంట్‌ ఎదుట కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీల మధ్య ఘర్షణ.. రాహుల్ గాంధీపై కేసు
Rahul Gandhi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 20, 2024 | 6:54 AM

పార్లమెంట్‌ సాక్షిగా కాంగ్రెస్‌ , బీజేపీ ఎంపీల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. రాహుల్‌గాంధీ తమపై దాడి చేశారని బీజేపీ ఎంపీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్‌గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే పార్లమెంట్‌ లోపలికి వెళ్లకుండా బీజేపీ ఎంపీలే తమను అడ్డుకొని దాడి చేశారని ఆరోపించారు రాహుల్‌.. అంబేద్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యల నుంచి డైవర్షన్‌ చేసేందుకే బీజేపీ కొత్త డ్రామా మొదలుపెట్టిందని మండిపడ్డారు.

రాజ్యసభలో బాబా సాహేబ్‌ అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యల వ్యవహారం మరో మలుపు తిరిగింది.. పార్లమెంట్‌ ఆవరణలో మకరద్వారం దగ్గర కాంగ్రెస్‌ , బీజేపీ ఎంపీలు పోటాపోటీగా ఆందోళన చేపట్టారు.. అయితే ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు బీజేపీ ఎంపీలతో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, మరో సీపీఎం ఎంపీకి గాయాలయ్యాయి.

రాహుల్‌గాంధీ తనపై దాడి చేశాడని తీవ్రంగా గాయపడ్డ బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సారంగి ఆరోపించారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాహుల్‌గాంధీపై స్పీకర్‌కు బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అయితే తాను ఎవరిపై దాడి చేయలేదన్నారు రాహుల్‌గాంధీ.. అంతేకాకుండా పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసుస్టేషన్‌లో రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ ఫిర్యాదు చేశారు.

దీనిపై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.. కేంద్రమంత్రి పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను అవమానించారని.. అమిత్‌షా క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. ఈ క్రమంలోనే.. ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారంటూ విమర్శించారు.. అంబేద్కర్‌ విగ్రహం నుంచి తాము శాంతియుతంగా పార్లమెంట్‌ వైవు వచ్చామని.. పార్లమెంట్‌ మెట్ల దగ్గర బీజేపీ ఎంపీలు తమను అడ్డుకున్నారన్నారు.

కాగా.. రాహుల్‌గాంధీ పైనే బీజేపీ ఎంపీలు దాడి చేశారని స్పీకర్‌ ఓంబిర్లాకు కాంగ్రెస్‌ ఎంపీలు కూడా ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌ లోపలికి వెళ్లకుండా తమను అడ్డుకున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీలపై కాంగ్రెన్‌ నేతలు కూడా పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తన కళ్ల ముందే ఖర్గేను బీజేపీ ఎంపీలు కిందకు తోసేశారని ఆరోపించారు ప్రియాంకాగాంధీ. రాహుల్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ తీరుపై బీజేపీ మండిపడుతోంది. విపక్ష నేతగా ఆయన పనికిరాడని అన్నారు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. ఆయనే బీజేపీ ఎంపీలపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..