అయ్యో.. అందాల హన్సిక ఇక తెలుగు సినిమాల్లో కనిపించదా..
Rajeev
19 December 2024
యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ అందానికి ఎలాంటి కుర్రాడైన పడిపోవాల్సిందే.
2007లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
దీని తరువాత, నటి హన్సిక మోత్వానీ 2011 సంవత్సరంలో సూరజ్ దర్శకత్వం వహించిన మాప్పిళ్ళై' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
తెలుగు, తమిళ్ భాషల్లో హన్సికాకు తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో ఆఫర్స్ క్యూ కట్టాయి.
తెలుగులో ఎన్టీఆర్, రామ్ పోతినేని, ప్రభాస్ తో బిల్లా, రవితేజతో పవర్ సినిమాలు చేసింది హన్సిక. అలాగే తమిళ్ లోనూ స్టార్స్ తో నటించింది.
పెళ్ళైన తర్వాత హన్సిక సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ఆసక్తి చూపుతుంది.
తెలుగులో ఓ టీవీ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది ఈ అమ్మడి. అయితే ఈ చిన్నది ఇక తెలుగు సినిమాల్లో నటించదా అనే డౌట్స్ కొంతమంది నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు.